New Smartphones in India: జులైలో వచ్చిన టాప్ ఫోన్లు ఇవే - రూ.15 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు!
July Launched Smartphones: భారతదేశంలో ప్రతి నెలా ఎన్నో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతూనే ఉంటాయి. అయితే 2024 జులైలో చెప్పుకోదగ్గదాని కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లు, మంచి ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.
Smartphones Launched In July: జులై నెలలో ఎన్నో పవర్ ఫుల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 కూడా ఉన్నాయి. అంతేకాకుండా మొదటిసారిగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన ఫిన్నిష్ కంపెనీ హెచ్ఎండీ... జులై నెలలోనే భారతదేశంలో తన రెండు హ్యాండ్‌సెట్‌లు క్రెస్ట్, క్రెస్ట్ మ్యాక్స్‌ని కూడా విడుదల చేసింది. ఇది కాకుండా నథింగ్ తాజా స్మార్ట్‌ఫోన్ ఫోన్ 2ఏ ప్లస్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇవి కాకుండా అనేక ఇతర మొబైల్ బ్రాండ్లు కూడా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. కాబట్టి జూలై నెలలో విడుదలైన టాప్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను చూద్దాం.
నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ (Nothing Phone 2a Plus)
నథింగ్స్ ఫోన్ 2ఎ ప్లస్ అనేది కంపెనీ ఇంతకు ముందు లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 2ఎకి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో 5జీ ప్రాసెసర్ కూడా ఉంది. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. ఇందులో 50W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని ధర రూ.27,999 నుంచి ప్రారంభం అవుతుంది.
వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4)
వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్‌లో 6.74 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది మాత్రమే కాకుండా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌ని ఈ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశారు. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 (Samsung Galaxy Z Flip 6 and Fold 6)
పారిస్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6లను ప్రపంచానికి పరిచయం చేసింది. కంపెనీ తన రెండు ఫోన్‌లలో అనేక కొత్త అప్‌గ్రేడ్‌లను చేసింది. ఇది కాకుండా ఈ డివైస్‌కి ఏఐ ఫీచర్లు కూడా యాడ్ చేశారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ధర రూ. 1,09,999 నుంచి, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ధర రూ.1,64,999 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1)
నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఈ నెలలో భారతదేశంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. అదే సీఎంఎఫ్ ఫోన్ 1. సీఎంఎఫ్ ఫోన్ 1 వెనుక ప్యానెల్ ఇతర ఫోన్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. స్క్రూల సహాయంతో యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫోన్ ప్యానల్‌ని మార్చుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ.15,999 నుంచి ప్రారంభమవుతుంది.
హెచ్ఎండీ క్రెస్ట్, హెచ్ఎండీ క్రెస్ట్ మాక్స్ (HMD Crest and HMD Crest Max)
ఫిన్నిష్ మొబైల్ కంపెనీ హెచ్ఎండీ తన రెండు స్మార్ట్‌ఫోన్‌లను మనదేశంలో లాంచ్ చేసింది. అవే హెచ్ఎండీ క్రెస్ట్, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్. ఈ రెండు ఫోన్‌లు 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,499గా ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?