స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకండి. మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని విషయాలు మనసులో ఉంచుకోవాలి. అప్పుడు బ్యాటరీ పాడై ఫోన్ పేలకుండా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ పూర్తిగా జీరో పర్సెంట్‌కు రాకూడదు. 20 శాతానికి రాగానే ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. కంపెనీ ఇచ్చిన ఛార్జర్ కాకుండా ఇతర లోకల్ ఛార్జర్లు వాడకూడదు. ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచడం అతిపెద్ద బ్లండర్. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ అస్సలు వాడకండి. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వేడెక్కితే పూర్తయిన అనంతరం వెంటనే వాడకూడదు. ఒకేసారి పూర్తిగా ఛార్జింగ్ పెట్టకుండా 80 శాతం వరకు మాత్రమే పెట్టండి.