గూగుల్ క్రోమ్ ఐదు సూపర్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రోమ్‌కు జెమినీ ఏఐ ఫీచర్లను కూడా యాడ్ చేసింది. దీంతోపాటు మరో ఐదు అప్‌డేట్స్‌ను అందిస్తోంది. వెబ్ బ్రౌజర్,డెస్క్‌టాప్, టాబ్లెట్, మొబైల్ యూజర్లందరూ ఈ ఫీచర్లు వాడుకోవచ్చు. ఈ ఫీచర్లతో టైం సేవింగ్‌తోపాటు మరెన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. మీరు ఏదైనా రెస్టారెంట్ వెతికేటప్పుడు రెస్టారెంట్‌లతోపాటు ఫోన్‌నెంబర్, డైరెక్షన్, రివ్యూ కనిపిస్తాయి. ప్రస్తుతానికి పక్క ఫీచర్ మొబైల్ ఫోన్‌లలోనే అందుబాటులో ఉంది. ఇకపై iOSలోకి కూడా రానుంది. మొబైల్‌లో క్రోమ్ అడ్రస్ బార్ సరికొత్తగా డిజైన్ చేసింది. మీకు నచ్చిన లాంగ్వేజ్‌కు మార్చుకోవచ్చు. అడ్రస్ బార్‌లోని డ్రాప్-డౌన్ మెను కింద వెబ్‌సైట్స్ చూసుకోవచ్చు. దీని వల్ల ముందుకు వెనక్కి వెళ్లడం సులభమవుతుంది. క్రోమ్‌లో మీ సెర్చ్ హిస్టరీ ఆధారంగా ఎప్పటికప్పుడు దానికి రిలేటెడ్ వెబ్‌సైట్‌లను సిఫార్సు చేస్తుంది. iOS అడ్రస్ బార్‌లో ట్రెండింగ్ సెర్చ్ ఫీచర్ కనిపించనుంది. అడ్రెస్ బార్ నుంచి న్యూ ట్యాబ్ పేజీ క్లిక్ చేసినప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ కనిపిస్తాయి. స్పోర్ట్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం క్రోమ్ యూజర్లు ప్రత్యేకంగా వెతకాల్సిన పని లేకుండా చేస్తోంది. iOS, ఆండ్రాయిడ్ క్రోమ్‌లో నచ్చిన టీమ్‌ను ఫాలో కావచ్చు. వాళ్లు ఆడే టైంలో మీకు ఆటోమేటిక్ అప్‌డేట్స్ వచ్చేస్తాయి. మీ సెర్చ్ ఆధారంగా కొన్ని లైవ్ స్పోర్ట్స్ కార్డ్‌లు సజెస్ట్ చేస్తుంది గూగుల్ క్రోమ్.