Samsung Galaxy: అదిరిపోయే స్మార్ట్ ఫోన్లకు ప్రీ బుకింగ్ షురూ, ఇప్పుడే బుక్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఇవే
Samsung సరికొత్త ఫోల్డ బుల్ ఫోన్ Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించి ప్రీ-బుకింగ్ ఈరోజు (ఆగస్టు 16, మంగళవారం) నుంచి మొదలు పెట్టింది.
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం Samsung తన సరికొత్త ఫోల్డ బుల్ ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది. Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించి ప్రీ-బుకింగ్ ఈరోజు (ఆగస్టు 16, మంగళవారం) నుంచి మొదలు పెట్టింది. ఈ లేటెస్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే స్మార్ట్ ఫోన్ల ప్రియులు Samsung అధికారిక వెబ్‌సైట్ ద్వారా వీటిని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ధర ఎంత? ప్రీ బుకింగ్స్ తో కలిగే లాభం ఏంటి?
ఇండియాలో ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ధరను Samsung కంపెనీ ఇప్పటికే ఫిక్స్ చేసింది. Samsung Galaxy Z Fold 4 ధర రూ. 1.55 లక్షలుగా నిర్ణయించింది. అటు Samsung Galaxy Z Flip 4 ధర రూ. 90 వేల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తగా లాంచ్ చేయబడిన ఈ రెండు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ల ప్రీ-బుకింగ్ Samsung లైవ్ కామర్స్ ఈవెంట్ లో మధ్యాహ్నం 12 గంటలకు మొదలు పెట్టింది. ఈ మోడళ్లను ప్రీ-బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారులు రూ.40 వేల కంటే ఎక్కువ విలువైన బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. Galaxy Z Flip 4కు సంబంధించిన బెస్పోక్ ఎడిషన్‌ను ప్రీ బుక్ చేయాలనుకునే కొనుగోలుదారులు రూ.2 వేల విలువైన కాంప్లిమెంటరీ స్లిమ్ క్లియర్ కవర్‌ను పొందవచ్చు. అంతేకాదు.. మున్ముందు కొనుగోలు చేయాలి అనుకునే వారు.. రూ. 1,999 చెల్లించి Galaxy Z Flip 4, Galaxy Z Fold 4ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
అదిరిపోయే ఫీచర్లు
Galaxy Z Flip 4 అప్‌గ్రేడ్ చేయబడిన కెమెరాలను కలిగి ఉంది. పెద్ద బ్యాటరీతో పాటు అల్ట్రా-కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది. Galaxy Z Fold 4 షేప్ షిఫ్టింగ్ డిజైన్ తో పాటు PC లాంటి మల్టీ టాస్కింగ్ ఫీచర్లతో డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అప్ గ్రేడ్ చేయడంతో పాటు అధునాతన కెమెరాను కలిగి ఉంటుంది. Galaxy Z Flip 4 కాంపాక్ట్ క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తుంది. Galaxy Z Fold 4 అనేది Android 12Lతో రూపొందించిన ఫస్ట్ డివైజ్ ఇదే కావడం విశేషం. ఫోల్డబుల్‌తో సహా పెద్ద స్క్రీన్ అనుభూతి కోసం Google రూపొందించిన Androidకు సంబంధించిన స్పెషల్ వెర్షన్ ను దీనికోసం వినియోగించారు. కొత్త టాస్క్‌బార్‌తో Z ఫోల్డ్ 4లో మల్టీ టాస్కింగ్ చేయడం సులభంగా ఉంటుంది. ఇది PCకి సమానమైన లేఅవుట్‌ను అందిస్తుంది.
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
అప్‌గ్రేడ్ చేసిన 50MP వైడ్-లెన్స్, 30x స్పేస్ జూమ్ లెన్స్‌తో Galaxy Z Fold 4 మరింత క్వాలిటీతో కూడిన ఫోటోలు, వీడియోలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది క్యాప్చర్ వ్యూ మోడ్, డ్యూయల్ ప్రివ్యూ, రియర్ కామ్ సెల్ఫీలో యాక్టివేట్ చేయబడిన జూమ్ మ్యాప్‌తో సహా అనేక రకాల కెమెరా మోడ్‌లను కూడా కలిగి ఉంది. లార్జ్ ఫిక్సెల్ సైజ్, 23 శాతం బ్రైట్ నెస్ సెన్సార్, మెరుగైన ప్రాసెసింగ్ పవర్ ను కలిసి ఉంటుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?