Samsung Galaxy A16 5G: రూ.20 వేలలోపే ఎక్సలెంట్ 5జీ ఫోన్ - శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ వచ్చేసింది!
Samsung New Phone: శాంసంగ్ మనదేశంలో తన కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy A16 5G Launched: శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ (Samsung Galaxy A16 5G) స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు ఆరు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. ఇందులో 6.7 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌లను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌లను ఇందులో అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ధర (Samsung Galaxy A16 5G Price in India)
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇతర రిటైల్ ప్లాట్‌ఫాంల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy A16 5G Specifications)
శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆరు ఓఎస్ అప్‌గ్రేడ్లు, ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్‌లో ముందువైపు 13 మెగాపిక్సెల్ లెన్స్ అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 2.5 రోజుల పాటు ప్లేబ్యాక్ టైమ్‌ను ఈ ఫోన్ డెలివర్ చేయనుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.79 మిల్లీమీటర్లుగా ఉంది. శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్‌ను ఇందులో అందించారు. శాంసంగ్ వాలెట్ ద్వారా ట్యాప్ అండ్ పే ఫీచర్ కూడా ఉపయోగించవచ్చు. శాంసంగ్ మనదేశంలో ఇటీవల బడ్జెట్ ఫోన్ల మీద బాగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?