News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samsung Galaxy A13: రూ.10 వేలలోపు శాంసంగ్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ ఏ13 4జీని త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

శాంసంగ్ గెలాక్సీ ఏ13 4జీ స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా ఇందులో లీకయ్యాయి. దీన్ని బట్టి ఇందులో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను శాంసంగ్ ఇందులో అందించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఎన్నో లీకులు వచ్చాయి. దీని ముందు వెర్షన్ ఎక్సినోస్ గెలాక్సీ ఏ12లో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను అందించారు. దీని 5జీ వేరియంట్ గతంలోనే యూఎస్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని సమాచారం.

SM-A135F మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్లో కనిపించింది. ఇందులో 3 జీబీ ర్యామ్ ఉండనుంది. మరిన్ని వేరియంట్లు కూడా ఉండే అవకాశం ఉండనుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి ఇందులో స్పీకర్ గ్రిల్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉండనున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్ ఫోన్ మొదట మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. అయితే మనదేశంలో దీన్ని ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడటమే దీనికి కారణం.

శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేసింది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ13 4జీ స్మార్ట్ ఫోన్ మాస్ ప్రొడక్షన్ కూడా ఇటీవలే ప్రారంభం అయిందని తెలుస్తోంది. గ్రేటర్ నోయిడా ఫెసిలిటీ వీటి తయారీ జరగనుందని సమాచారం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు చూస్తే.. దీని ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 11:27 PM (IST) Tags: samsung Samsung New Phone Samsung Galaxy A13 4G Samsung A13 4G Samsung Galaxy A13 4G Launch Samsung Galaxy A13 4G Specifications Leaked Samsung Galaxy A13 4G Features

ఇవి కూడా చూడండి

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!

Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Kajal Aggarwal Photos : చుడిదార్ వేసిన చందమామ - కాజల్ కొత్త ఫొటోస్ చూశారా?

Kajal Aggarwal Photos : చుడిదార్ వేసిన చందమామ - కాజల్ కొత్త ఫొటోస్ చూశారా?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?