Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
భారతదేశ నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ జియో నాలుగు రోజుల పాటు అన్‌లిమిటెడ్ లాభాలను అందించనుంది.
రిలయన్స్ జియో తన వినియోగదారులకు నాలుగు రోజుల పాటు అన్‌లిమిటెడ్ లాభాలను అందించనుంది. అయితే ఇది వరదల కారణంగా ఎఫెక్ట్ అయిన అస్సాంలోని వినియోగదారులకు మాత్రమే లభించనుంది. ఈ విషయాన్ని జియో అధికారికంగా తెలియజేసింది.
ఈ ఆఫర్ అందుకోవడానికి అర్హులైన వినియోగదారులకు టెక్స్ట్ మెసేజ్‌ను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌లో ‘గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల కారణంగా సేవలు కాస్త ప్రభావితం అయ్యాయి. గుడ్ విల్ గెస్చర్‌గా మీ నంబర్‌కు నాలుగు రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను కాంప్లిమెంటరీగా అందిస్తున్నాం.’ అన్నారు.
జియో ఫ్రీ అన్‌లిమిటెడ్ లాభాలు
దిమా హసావో, కర్బీ ఆంగ్లాగ్ ఈస్ట్, కర్బీ ఆంగ్లాగ్ వెస్ట్, హొజాయ్, కాచర్ జిల్లాల్లోని వినియోగదారులకు ఈ అన్‌లిమిటెడ్ లాభాలను రిలయన్స్ జియో అందిస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లాభాలు లభించనున్నాయి. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు.
ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో మీరు ప్రేమించిన వారితో టచ్‌లో ఉండటం ముఖ్యమని జియో తెలిపింది. అందుకే నాలుగు రోజుల పాటు కాంప్లిమెంటరీ వాయిస్ ప్యాక్, డేటా ప్యాక్ అందించనున్నట్లు తెలిపింది. వీటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా అందించనున్నారు.
గతంలో జియో నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. వీటితో పాటు మూడు నెలల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌కు సబ్‌స్క్రిప్షన్ కూడా అందించనున్నారు. ఈ టెలికాం ఆపరేటర్ ప్రస్తుతం రూ.151, రూ.333, రూ.583, రూ.783 ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో రిలయన్స్ జియో రూ.2,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించనుంది. అంటే 365 రోజుల పాటు మొత్తంగా 912.5 జీబీ డేటా లభించనుందన్న మాట. ఎఫ్‌యూపీ అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. రోజువారీ డేటా అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. డైలీ డేటా కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా లభించనున్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram