అన్వేషించండి

Redmi Smart Band Pro Sale: రెడ్‌మీ కొత్త స్మార్ట్ వాచ్ సేల్ ప్రారంభం, రూ.3,499కే అదిరిపోయే ఫీచర్లు!

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు.

షియోమీ ఇటీవలే మనదేశంలో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ వాచ్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ బ్యాండ్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మొత్తం 110 వర్కవుట్ మోడ్స్ అందుబాటులో ఉండనున్నాయి.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ధర
ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.3,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద కొద్దికాలం పాటు రూ.3,499కే ఈ బ్యాండ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. షియోమీ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఎంఐ హోం స్టోర్లలో ఈ స్మార్ట్ బ్యాండ్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో స్పెసిఫికేషన్లు
ఈ వాచ్‌లో 1.47 అంగుళాల ఆల్వేస్ ఆన్ అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లేను అందించారు. అపోలో 3.5 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ వాచ్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 200 ఎంఏహెచ్ కాగా.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ వాచ్ అందించనుందని కంపెనీ తెలిపింది.

ఈ బ్యాండ్‌లో లైఫ్‌క్యూ హెల్త్ ట్రాకింగ్ అల్గారిథంను అందించారు. పీపీజీ హార్ట్ రేట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ సెన్సార్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ వీ5.0ను కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో అందించారు. 5ఏటీయం వాటర్ ప్రూఫ్ ఫీచర్ ఇందులో ఉండటం విశేషం.

ఐవోఎస్ 10, ఆపైన లేదా ఆండ్రాయిడ్ 6 (మార్ష్‌మాల్లో), ఆపైన ఆపరేటింగ్ సిస్టంలను రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో సపోర్ట్ చేయనుంది. ఇందులో 110 వర్కవుట్ మోడ్స్‌ను షియోమీ అందించింది. ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది.

రన్నింగ్, వాకింగ్, జుంబా, పైలేట్స్, యోగా, సైక్లింగ్, హెచ్ఐఐటీ, జంపింగ్ రోప్ వంటి వర్కవుట్లను ఈ స్మార్ట్ వాచ ట్రాక్ చేయగలదు. దీంతోపాటు అవుట్ డోర్ వాకింగ్, అవుట్ డోర్ రన్నింగ్, ట్రెడ్ మిల్ వర్కవుట్లను ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయడం విశేషం. 

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

View this post on Instagram
 
A post shared by Redmi India (@redmiindia)

టాప్ హెడ్ లైన్స్

Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Embed widget