By: ABP Desam | Updated at : 21 Feb 2022 04:04 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం అయింది. (Image: Xiaomi)
Redmi Note 11S Amazon Sale: రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ నార్జో 30 ప్రో, ఇన్‌ఫీనిక్స్ నోట్ 10 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం32లతో పోటీ పడనుంది. మనదేశంలో అందుబాటులో ఉన్న 108 మెగాపిక్సెల్ కెమెరాల్లో రెడ్‌మీ నోట్ 11ఎస్ అత్యంత చవకైనది.
రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,499గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499గానూ ఉంది. అమెజాన్, షియోమీ అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్లను బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 తగ్గింపు అందించనున్నారు.
రెడ్‌మీ నోట్ 11ఎస్ ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ర్యామ్‌ను మరో 3 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌తో మొత్తంగా 11 జీబీ ర్యామ్‌ను (వర్చువల్ ర్యామ్‌తో కలిపి) ఈ ఫోన్‌లో పొందవచ్చన్న మాట.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ప్రో ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 11ఎస్ పనిచేయనుంది. ఈ ఫోన్ మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండగా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందుబాటులో ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!
Whatsapp: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!
Upcoming Mobiles: ఒకే రోజున ఐదు ఫోన్లు లాంచ్ - అక్టోబర్ 4న మొబైల్స్ పండగ!
Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?
Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>