అన్వేషించండి

Realme P1 Speed 5G: రూ.15 వేలలోనే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ - ఈసారి ఫుల్ ‘స్పీడ్’గా!

Realme New Phone: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో కొత్త గేమింగ్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ. దీని ధర మనదేశంలో రూ.17,999గా ఉంది.

Realme P1 Speed 5G Launched: రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ గేమింగ్ ఫోకస్డ్ పీ సిరీస్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై రన్ కానుంది. హీట్ మేనేజ్‌మెంట్ కోసం 6050 ఎంఎం స్క్వేర్ స్టెయిన్‌లెస్ వీసీ కూలింగ్ ఏరియాను అందించారు. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. రియల్‌మీ పీ1 5జీ, రియల్‌మీ పీ1 ప్రో 5జీ, రియల్‌మీ పీ2 ప్రో 5జీ సిరీస్‌లో ఇది కూడా భాగం అయింది.

రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ ధర (Realme P1 Speed 5G Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. అయితే ఈ రెండు ఫోన్లపై రూ.2,000 లిమిటెడ్ కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ద్వారా రెండు వేరియంట్లపై రూ.2,000 తగ్గింపు లభించనుంది. బ్రష్డ్ బ్లూ, టెక్స్చర్డ్ టైటానియం కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 20వ తేదీన రియల్‌మీ.కాం, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Read Also: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే

రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme P1 Speed 5G Specifications)
డ్యూయల్ సిమ్ రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 92.65 శాతంగా ఉంది. రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా యూనిట్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఉపయోగించని ర్యామ్ నుంచి స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. యాక్సెలరేషన్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నటిక్ ఇండక్షన్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్, లైట్ సెన్సార్లు అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహచ్ కాగా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.

Read Also: ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Telangana News : ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Jammu Kashmir CM: జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Telangana News : ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Jammu Kashmir CM: జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Unstoppable Season 4: అన్ స్టాపబుల్ సీజన్ 4 రెడీ - ఈ సారి గెస్టులు ఎవరంటే?
అన్ స్టాపబుల్ సీజన్ 4 రెడీ - ఈ సారి గెస్టులు ఎవరంటే?
Johnson And Johnson: జాన్సన్‌ బేబీ పౌడర్‌ వాసన పీల్చినా క్యాన్సర్‌!? - తస్మాత్‌ జాగ్రత్త!
జాన్సన్‌ బేబీ పౌడర్‌ వాసన పీల్చినా క్యాన్సర్‌!? - తస్మాత్‌ జాగ్రత్త!
Sovereign Gold Bond : గోల్డ్ బాండ్లలో రూపాయికి రూపాయి లాభం - ఈ ఇన్వెస్టర్లు వెరీ లక్కీ
గోల్డ్ బాండ్లలో రూపాయికి రూపాయి లాభం - ఈ ఇన్వెస్టర్లు వెరీ లక్కీ
Karimnagar News: కరీంనగర్ జిల్లాలో గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి- కారణమేంటంటే? 
కరీంనగర్ జిల్లాలో గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి- కారణమేంటంటే? 
Embed widget