News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Realme GT Neo 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. మొదటి సేల్‌లో రూ.7 వేలు తగ్గింపు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ జీటీ నియో 2ని మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర మనదేశంలో రూ.31,999 నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

రియల్‌మీ జీటీ నియో 2 మనదేశంలో లాంచ్ అయింది. చైనాలో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ నియోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. 5జీ కనెక్టివిటీని కూడా ఇందులో అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎం52, ఎంఐ 11ఎక్స్ 5జీ, పోకో ఎఫ్3 జీటీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.

రియల్‌మీ జీటీ నియో 2 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. నియో బ్లాక్, నియో బ్లూ, నియో గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

దీనికి సంబంధించిన సేల్ అక్టోబర్ 17వ తేదీన ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాంలో ప్రారంభం కానుంది. ఫెస్టివల్ సీజన్ సేల్‌లో కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు తగ్గింపును అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం అక్టోబర్ 16వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

రియల్‌మీ జీటీ నియో 2 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డీసీ డిమ్మింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 600 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా 7 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 65w ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. పూర్తిగా చార్జ్ కావడానికి కేవలం 36 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. 

Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?

Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!

Also Read: వన్‌ప్లస్ 9ఆర్‌టీలో ఈ ఫీచర్లు పక్కా.. అదిరిపోయే న్యూస్ చెప్పిన కంపెనీ!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Oct 2021 04:44 PM (IST) Tags: Realme Realme New phone Realme New 5G Phone Realme GT Neo 2 Realme GT Neo 2 Price Realme GT Neo 2 Specifications Realme GT Neo 2 Features Realme GT Neo 2 Price in India Realme GT Neo 2 Offers

ఇవి కూడా చూడండి

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?

Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?

టాప్ స్టోరీస్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?

CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?

Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!

Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
×