అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Realme GT 2: రియల్‌మీ బెస్ట్ స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి - కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో రియల్‌మీ జీటీ 2 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది.

రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో వచ్చే నెల లాంచ్ కానుంది. ఏప్రిల్ 7వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. రియల్‌మీ జీటీ 2 ప్రోతో పాటు రియల్‌మీ జీటీ 2 కూడా మనదేశంలో లాంచ్ కానుంది. ఈ రెండు ఫోన్లను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. ఇవి చైనాలో గఈ సంవత్సరం జనవరిలోనే లాంచ్ అయ్యాయి.

ఈ స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేస్తున్నట్లు కంపెనీ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి కాబట్టి వీటి స్పెసిఫికేషన్ల విషయంలో ఎటువంటి దాపరికం లేదు.

రియల్‌మీ జీటీ 2 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 65W సూపర్‌డార్ట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.86 సెంటీమీటర్లుగానూ, బరువు 194.5 గ్రాములుగానూ ఉంది.

రియల్‌మీ జీటీ 2 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల 2కే ఎల్టీపీవో అమోఎల్ఈడీ 10-బిట్ సూపర్ రియాలిటీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను వీటిలో కూడా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 65W సూపర్‌డార్ట్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 33 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుందని తెలుస్తోంది. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad MMTS Stations: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
US Iran War Updates: ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad MMTS Stations: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
US Iran War Updates: ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Bengal BJP: బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
PM Modi Victory Speech: బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
Embed widget