Realme GT 2 Series Launch: రియల్‌మీ బెస్ట్ ఫోన్లు లాంచ్ ఈరోజే.. ధర ఎంత ఉండనుందంటే?
రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్లు ఈరోజు లాంచ్ కానున్నాయి. అవే రియల్‌మీ జీటీ 2 సిరీస్. ఇందులో రియల్‌మీ జీటీ 2, రియల్‌మీ జీటీ 2 ప్రో.
రియల్‌మీ జీటీ 2 సిరీస్ లాంచ్ ఈరోజు (డిసెంబర్ 20వ తేదీ) జరగనుంది. ఇందులో రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఉండనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు రియల్‌మీ జీటీ 2 కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
రియల్‌మీ జీటీ 2 సిరీస్ లాంచ్ లైవ్ స్ట్రీమ్ వివరాలు
భారతదేశ కాలమానం ప్రకారం ఈ ఫోన్ లాంచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. యూట్యూబ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా దీనికి సంబంధించిన అప్‌డేట్స్ చూడవచ్చు. కింద ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా దీన్ని లైవ్‌లో చూడవచ్చు.
రియల్‌మీ జీటీ 2 ప్రో ధర(అంచనా)
మిగతా అన్ని డివైస్‌ల కంటే రియల్‌మీ జీటీ 2 ప్రో మీదనే ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి. దీని ధర 4,000 యువాన్లలోపు(సుమారు రూ.47,700) ఉండనుందని తెలుస్తోంది. దీంతోపాటు రియల్‌మీ జీటీ 2 ప్రో ప్రత్యేక వేరియంట్ కూడా లాంచ్ కానుంది. దీని ధర 5,000 యువాన్లుగా(సుమారు రూ.59,600) ఉండనుందని సమాచారం.
రియల్‌మీ జీటీ 2 ప్రో స్పెసిఫికేషన్లు(అంచనా)
రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గత నెలలో అధికారికంగా ప్రకటించింది. చైనా 3సీ, అమెరికా ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్లను కూడా ఈ ఫోన్ పొందింది. ఈ ఫోన్ మనదేశంలో 2022 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.8 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నారు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఇందులో ఏకంగా 150 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉండనుంది.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Vivo Neckband Earphones: రూ.2 వేలలోపే వివో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. డ్రైవర్ సైజ్ ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!