Vivo Neckband Earphones: రూ.2 వేలలోపే వివో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. డ్రైవర్ సైజ్ ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మనదేశంలో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ లాంచ్ చేసింది. అవే వివో వైర్‌లెస్ స్పోర్ట్ లైట్ నెక్‌బ్యాండ్.
వివో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ లాంచ్ చేసింది. అవే వివో వైర్‌లెస్ స్పోర్ట్ లైట్ నెక్‌బ్యాండ్. ఇందులో మంచి ఫీచర్లు ఉన్నాయి. 11.2 ఎంఎం డ్రైవర్లను వివో ఇందులో అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 129 ఎంఏహెచ్‌గా ఉంది. 10 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే ఐదు గంటల ప్లేబ్యాక్ టైంను ఇది అందించనుంది.
వివో వైర్‌లెస్ స్పోర్ట్ లైట్ నెక్‌బ్యాండ్ ధర
దీని ధరను మనదేశంలో రూ.1,999గా నిర్ణయించారు. వివో ఇండియా ఈ-స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, బ్లూ రంగుల్లో ఇది లాంచ్ అయింది.
వివో వైర్‌లెస్ స్పోర్ట్ లైట్ నెక్‌బ్యాండ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 11.2 ఎంఎం డ్రైవర్లను అందించారు. ఇవి 18 గంటల ప్లేబ్యాక్ టైంను అందించనున్నాయి. ఇందులో డైకొకు అల్యూమినియం కోటెడ్ బ్రాంజ్ కాయిల్‌ను అందించారు. ఇవి హై ఫ్రీక్వెన్సీలను రీప్రొడ్యూస్ చేస్తాయి. ఈ నెక్‌బ్యాండ్ 80 మిల్లీసెకన్ల వరకు లో లేటెన్సీ రేట్‌ను కూడా అందిస్తాయి.
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను వీటిలో అందించారు. ఈ ఫీచర్ ద్వారా చుట్టుపక్కల ఉన్న సౌండ్లు లేకుండా ఇయర్‌ఫోన్స్‌లోవి క్లియర్‌గా వినిపించనున్నాయి. 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే ఐదు గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయని తెలుస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 129 ఎంఏహెచ్‌గా ఉంది.
బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్ వీ5.0ని ఇందులో అందించారు. ఇందులో భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. దీని బరువు 23.9 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. వాటర్, స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఇందులో ఫంక్షనల్ ఫీచర్లు, ఈజీ కనెక్షన్, మ్యాగ్నెటిక్ స్విచ్, గూగుల్ వాయిస్ అసిస్టెన్స్, క్విక్ పెయిర్, గేమ్ లో ల్యాగింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!