అన్వేషించండి

Poco C65 India Launch: పోకో సీ65 బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - రూ.10 వేలలోనే 8 జీబీ + 256 జీబీ!

Poco C65: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది.

Poco C65: పోకో సీ65 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. నవంబర్‌లో ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ అయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన పోకో సీ55కి తర్వాతి వెర్షన్‌గా పోకో సీ65 మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. పోకో సీ65లో మెరుగైన కెమెరాలు అందించనున్నారు.

పోకో సీ65 ధర (అంచనా)
ఈ ఫోన్ గ్లోబల్ వెర్షన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 129 డాలర్లుగా (సుమారు రూ.10,700) నిర్ణయించారు. కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 109 డాలర్లకే (సుమారు రూ.9,100) దీన్ని అందించారు. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 149 డాలర్లుగా (సుమారు రూ.12,400) ఉంది. అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను 129 డాలర్లకే (సుమారు రూ.10,700) దక్కించుకోవచ్చు. బ్లాక్, బ్లూ, పర్పుల్ రంగుల్లో పోకో సీ65 గ్లోబల్ వెర్షన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర మనదేశంలో కూడా ఇదే ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రూ.10 వేలలోపు ప్రైస్ బ్రాకెట్‌లో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఫోన్ అంటే భారతీయ కస్టమర్లకు ఇది మంచి డీల్ కానుంది.

పోకో సీ65 స్పెసిఫికేషన్లు (అంచనా)
దీనికి సంబంధించిన గ్లోబల్ వెర్షన్  ఇప్పటికే లాంచ్ అయింది. ఇండియన్ వెర్షన్‌లో కూడా ఇవే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ వెర్షన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించనున్నారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20.6:9గా ఉండటం విశేషం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో దీని డిస్‌ప్లేను ప్రొటెక్ట్ చేయనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై పోకో సీ65 పనిచేయనుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే ఆప్షన్ కూడా అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మెయిన్ కెమెరా కెపాసిటీ 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

పోకో సీ65 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టివిటీ ఆప్షన్లు అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Embed widget