Paytm Bank Ban: పేటీయం బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం - మీరు వాడుతూ ఉంటే జాగ్రత్త!
Paytm Ban: పేటీయం బ్యాంకు, కొన్ని సర్వీసులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.
Paytm Payment Bank: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై నిషేధాన్ని ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్తగా కస్టమర్లను ఆన్‌బోర్డింగ్ చేయడం, వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌ల్లో డిపాజిట్లు, టాప్ అప్ చేయకుండా నిషేధించారు.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో పేటీఎంకు సంబంధించిన కొన్ని సేవలను అనుమతిస్తారని తెలిపారు. వినియోగదారులు వాలెట్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ను వారి సేవింగ్స్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ‘నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం, బ్యాంకులో మెటీరియల్ పర్యవేక్షణపై ఆందోళనలు తలెత్తడం’ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఎక్స్‌టర్నల్ పార్టీలు కంపెనీ సిస్టంలపై చేసిన ఆడిట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయని ప్రకటించింది.
దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్‌ను ఆర్బీఐ జనవరి 31వ తేదీన విడుదల చేసింది. పేటీయం వాలెట్ యూజర్లు దీని కారణంగా కాస్త ఇబ్బంది పడనున్నారు. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే 2018లో దాదాపు మూడు కోట్ల మంది పేటీయం ద్వారా చెల్లింపులు జరిపేవారు. అక్కడి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి వినియోగదారులు వేరే ఆప్షన్లు పరిశీలించక తప్పదు.
ఆర్బీఐ వెబ్‌సైట్ ప్రకారం పేటీయం కస్టమర్‌లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లలో ఎలాంటి పరిమితి లేకుండా మిగిలిన బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు.
అన్ని పైప్‌లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాల (ఫిబ్రవరి 29న లేదా అంతకు ముందు ప్రారంభించిన అన్ని లావాదేవీలకు సంబంధించి) లావాదేవీలను పూర్తి చేసే సమయం మార్చి 15వ తేదీ వరకు పొడిగిస్తామని ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరగడానికి అవకాశం ఉండదు.
పేటీయం బదులుగా ఏ యాప్‌లు ఉపయోగించాలి?
భారతదేశంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేసేవారికి పేటీయం ఒక పెద్ద ఆప్షన్. పేటీయం ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది చెల్లింపులు చేస్తారు. అటువంటి పరిస్థితిలో పేటీయం పేమెంట్స్ బ్యాంక్ అందించే చాలా ఫీచర్లు నిషేధించిన తర్వాత వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లను తప్పక ఉపయోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించే కొన్ని ప్రధాన చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల జాబితాను చూద్దాం.
1. ఫోన్‌పే (PhonePe)
2. గూగుల్ పే (Google Pay)
3. అమెజాన్ పే (AmazonPay)
4. వాట్సాప్ పే (WhatsApp Pay)
5. మొబిక్విక్ (Mobikwik)
6. ఫ్రీ ఛార్జ్ (Free Charge)
7. ఎయిర్‌టెల్ మనీ (Airtel Money)
8. జియో మనీ (Jio Money)
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!