Oppo Foldable Phone: ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది.. ధర చూస్తే షాకే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో ఫైండ్ ఎన్.
ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో ఫ్లెక్సిబుల్ హింజ్ ఉందని, పూర్తిగా ఫోల్డ్ అవుతుందని, ఒకసారి ఫోల్డ్ అయ్యాక రెండు అంచుల మధ్య ఎటువంటి గ్యాప్ ఉండదని ఒప్పో అంటోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3తో ఇది పోటీ పడనుంది.
ఒప్పో ఫైండ్ ఎన్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందించారు. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,699 యువాన్లుగా(సుమారు రూ.92,100) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 8,999 యువాన్లుగా(సుమారు రూ.1,07,000) నిర్ణయించారు. బ్లాక్, పర్పుల్, వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
ఒప్పో ఫైండ్ ఎన్ స్పెసిఫికేషన్లు
నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసిన అనంతరం ఒప్పో ఫైండ్ ఎన్‌కు ఒక రూపం వచ్చింది. ఆరు జనరేషన్ల ప్రోటో టైపులు రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ బయటవైపు 5.49 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉంది. ఇక లోపల ఉన్న అన్‌ఫోల్డెడ్ డిస్‌ప్లే సైజు 7.1 అంగుళాలుగా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఎల్టీపీవో టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 8.4:9గా ఉంది.
ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 33W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. సగం బ్యాటరీ 30 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. పూర్తిగా చార్జ్ అవ్వడానికి 70 నిమిషాల సమయం పట్టనుంది. 15W వైర్‌లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.
ఇందులో మొత్తంగా ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 కెమెరాను అందించారు. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉండనున్నాయి. ఇక అవుటర్ స్క్రీన్ వైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండనున్నాయి.
ఆండ్రాయిడ్ ఆధారిత కస్టం సాఫ్ట్‌వేర్‌పై ఒప్పో ఫైండ్ ఎన్ పనిచేయనుంది. ఇందులో వినియోగదారుల కోసం కొన్ని గెస్చర్లు కూడా ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?