Oppo Foldable Phone: ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది ఆరోజే.. ఇప్పుడున్న మొబైల్స్ కంటే కొత్తగా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ అయిన ఫైండ్ ఎన్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి, ఆరు తరాల ప్రొటోటైప్స్ రూపొందించాక ఈ స్మార్ట్ ఫోన్‌కు ఒక రూపం వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ తరహాలో ఒప్పో ఫైండ్ ఎన్‌లో కూడా లోపలికి ఫోల్డ్ చేసే డిజైన్ ఉంది. టీజర్లను బట్టి చూస్తే.. ఈ ఫోన్‌లో మెటల్ ఫినిష్ ఉండనుంది. రెండు వేర్వేరు ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్ డిసెంబర్ 15వ తేదీన లాంచ్ కానుందని సమాచారం.
ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, వన్‌ప్లస్ ఫౌండర్ పీట్ లా ఒక ప్రకటనలో ఈ ఫోన్ గురించిన వివరాలు తెలిపారు. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ మోడల్ సింపుల్‌గానూ, ఉపయోగించడానికి సులభంగానూ ఉండనుందని తెలుస్తోంది. ‘ఫైండ్ ఎన్ ద్వారా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో ఉండే ప్రధాన సమస్యను పరిష్కరించనున్నాం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లలో కంటే అత్యుత్తమ హింగే, డిస్‌ప్లే డిజైన్లు ఇందులో ఉండనున్నాయి.’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
దీంతోపాటు ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన టీజర్ వీడియోను కూడా ఒప్పో విడుదల చేసింది. ఈ 15 సెకన్ల వీడియోలో దీనికి సంబంధించిన ఇన్‌వార్డ్ ఫోల్డింగ్ డిజైన్‌ను చూపించారు. దీని అంచులు సన్నగా ఉండనున్నాయి. ఇది ఫోల్డబుల్ డిస్‌ప్లేలను కవర్ చేయనుంది.
ఇందులో పంచ్ హోల్ డిజైన్‌ను అందించనున్నారు. ఇందులో అండర్ డిస్‌ప్లే కెమెరా టెక్నాలజీ కూడా ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ తరహాలో గుండ్రటి మెటల్ డిజైన్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. దీని టీజర్ వీడియో ప్రకారం... ఇందులో ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది.
ఒప్పో ఫైండ్ ఎన్ మొదటి ప్రోటోటైప్‌ను 2018లోనే రూపొందించినట్లు లా తెలిపారు. 2013లో పీట్ లా వన్‌ప్లస్‌ను స్థాపించారు. ఒప్పో, వన్‌ప్లస్ విలీనం అనంతరం గతేడాది ఒప్పోలో ఈయన బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!