OnePlus New Launch: వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఇది సంక్రాంతి స్పెషల్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మనదేశంలో తన 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్ మనదేశంలో జనవరి 14వ తేదీన లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్ 9ఆర్‌టీ, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. ఈ వన్‌ప్లస్ ఫోన్ కలర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.
వీటిని కంపెనీ వర్చువల్‌గా లాంచ్ చేయనుంది. జనవరి 14వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. వన్‌ప్లస్ ఇండియా యూట్యూబ్ చానెల్‌లో ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. దీనికి సంబంధించిన ‘నోటిఫై’ బటన్ కూడా కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో కనిపించింది.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఒప్పో కలర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఉంది. ఇక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 1300 హెర్ట్జ్‌గానూ ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 65టీ వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో వన్‌ప్లస్ అందించింది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించారు. 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.
Also Read: Vivo V23 5G: వివో వీ23 ఫోన్లు వచ్చేశాయ్... 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!