Xiaomi 11i Hypercharge 5G: దేశంలో వేగంగా చార్జ్ అయ్యే ఫోన్.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్.. షియోమీ కొత్త ఫోన్ వచ్చేసింది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది.
![Xiaomi 11i Hypercharge 5G: దేశంలో వేగంగా చార్జ్ అయ్యే ఫోన్.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్.. షియోమీ కొత్త ఫోన్ వచ్చేసింది! Xiaomi 11i Hypercharge 5G Along with Vanilla Variant Price Specifications Xiaomi 11i Hypercharge 5G: దేశంలో వేగంగా చార్జ్ అయ్యే ఫోన్.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్.. షియోమీ కొత్త ఫోన్ వచ్చేసింది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/0d2fb193fa5762edc0b89a116d41bc7b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
షియోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ, షియోమీ 11ఐ 5జీ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. షియోమీ 11ఐ హైపర్ చార్జ్ మనదేశంలో అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఫోన్ అని కంపెనీ అంటోంది. ఇందులో 120W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందించారు. మనదేశంలో ఇంత ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఉన్న ఫోన్ లాంచ్ కావడం ఇదే మొదటిసారి.
షియోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ, షియోమీ 11ఐ 5జీ ధర
షియోమీ 11ఐ హైపర్‌చార్జ్‌లో రెండు వేరియంట్లు అందించారు. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా నిర్ణయించారు.
షియోమీ 11ఐ 5జీలో కూడా రెండు వేరియంట్లే ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గానూ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ జనవరి 12వ తేదీన జరగనుంది.
షియోమీ 11ఐ హైపర్ చార్జ్ 5జీ స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో) షియోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఎన్‌హేన్స్‌డ్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో రెండు స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్, హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్లు పొందాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అయితే బాక్స్‌లో ఇచ్చిన చార్జర్‌తో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. వేరే చార్జర్‌తో ఇంత వేగంగా చార్జింగ్ అవ్వదు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 204 గ్రాములుగా ఉంది.
షియోమీ 11ఐ 5జీ స్పెసిఫికేషన్లు
షియోమీ 11ఐ 5జీ ఫీచర్లు పూర్తిగా షియోమీ 11ఐ హైపర్ చార్జ్ తరహాలోనే ఉన్నాయి. ఇందులో 5160 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. షియోమీ 11ఐ 5జీ బరువు 207 గ్రాములుగా ఉంది.
Also Read: Vivo V23 5G: వివో వీ23 ఫోన్లు వచ్చేశాయ్... 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)