Motorola New 5G Phone: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో తన కొత్త ఫోన్ ఎడ్జ్ 20 ప్రోను లాంచ్ చేసింది. దీని ధర రూ.36,999గా ఉంది.
మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో మనదేశంలో లాంచ్ అయింది. మోటొరోలా ఎడ్జ్ 20 సిరీస్‌లో లేటెస్ట్ మోడల్ ఇదే. ఇందులో 144 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హోల్ పంచ్ డిస్‌ప్లేను కూడా ఇందులో అందించారు. స్టాక్ ఆండ్రాయిడ్ తరహా అనుభవాన్ని ఇది అందించనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. వన్‌ప్లస్ 9ఆర్, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ, ఎంఐ 11ఎక్స్ ప్రోలతో ఇది పోటీ పడనుంది.
మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.36,999గా నిర్ణయించారు. మిడ్‌నైట్ స్కై, ఐరిడీసెంట్ క్లౌడ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 3వ తేదీ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉండనుంది.
యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు లభించనుంది. ఆరు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం జులైలోనే దీన్ని యూరోప్‌లో లాంచ్ చేశారు.
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!
మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. టచ్ లేటెన్సీ 576 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. హైపర్‌ల్యాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, నైట్ మోడ్, పనోరమ, ప్రో మోడ్‌లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉండనున్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.99 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములుగానూ ఉంది.
Also Read: హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు.. ఇంట్లో వస్తువులు కొనడానికి రైట్ టైం!
Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!