అన్వేషించండి

Moto G85 Vs CMF Phone 1: మోటో జీ85 5జీ వర్సెస్ సీఎంఎఫ్ ఫోన్ 1 - రూ.20 వేలలోపు ఏది తోపు ఫోన్?

Best Phone Under Rs 20000: మనదేశంలో ఈ వారంలోనే మోటో జీ85 5జీ, సీఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. ఈ రెండూ దాదాపు ఒకే ధరతో మార్కెట్లో లాంచ్ అవ్వడంతో వీటి మధ్య పోటీ నెలకొంది.

Moto G85 5G Vs CMF Phone 1: ప్రస్తుతం భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.20 వేలలోపు సెగ్మెంట్లో విపరీతమైన పోటీ నడుస్తుంది. ఈ విభాగంలో కనీసం నెలకు రెండు, మూడు చెప్పుకోదగ్గ ఫోన్లు అయినా లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా రూ.20 వేలలోపు ధరలో రెండు రిమార్కబుల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అవే మోటో జీ85 5జీ, సీఎంఎఫ్ ఫోన్ 1. దీంతో వినియోగదారుల్లో రెండిట్లో ఏది బెస్ట్ అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ కూడా మొదలైంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్టో చూద్దాం.

దేని కెమెరా బెస్ట్?
ఇప్పుడున్న ఇన్‌స్టాగ్రామ్ యుగంలో అందరూ క్రియేటర్లే. కానీ మంచి కంటెంట్‌ను క్రియేట్ చేయాలంటే దానికి మంచి కెమెరా కూడా అవసరం. మోటో జీ85 5జీ, సీఎంఎఫ్ ఫోన్ 1 రెండిట్లోనూ 50 మెగాపిక్సెల్ కెమెరాలనే అందించారు. అంతే కాకుండా ఇవి రెండూ సోనీ సెన్సార్లే. కానీ రెండిటికీ మధ్య తేడా సెకండరీ కెమెరాలో ఉంది. మోటో జీ85 5జీలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌ను సెకండరీ కెమెరాగా అందించగా, సీఎంఎఫ్ ఫోన్ 1లో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. మెయిన్ కెమెరా విషయంలో టై అయినప్పటికీ, సెకండరీ కెమెరాతో మోటో జీ85 5జీ ఈ విభాగంలో ముందడుగు వేసింది.

ముందువైపు మోటో జీ85 5జీలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. సీఎంఎఫ్ ఫోన్ 1లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాల్లో కూడా మోటో జీ85 5జీనే ముందంజలో ఉంది. కాబట్టి ఓవరాల్ కెమెరా డిపార్ట్‌మెంట్‌లో మోటో జీ85 5జీకి ఓటు వేసేయచ్చు.

ఏ ఫోన్ ప్రాసెసర్ బెటర్‌గా ఉంది?
మనిషి చురుగ్గా పని చేయాలంటే బ్రెయిన్ ఎంత ముఖ్యమో... స్మార్ట్ ఫోన్ బాగా పని చేయాలంటే ప్రాసెసర్ అనేది అంతే ముఖ్యం. మోటో జీ85 5జీలో క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. సీఎంఎఫ్ ఫోన్ 1 మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌పై పని చేయనుంది. ఈ రెండిట్లోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 7300నే బెటర్ ప్రాసెసర్. అన్ని బెంచ్ మార్కింగ్ ప్లాట్‌ఫాంల్లో ఇదే మంచి స్కోరును సాధించింది. కాబట్టి పెర్ఫార్మెన్స్ విషయంలో సీఎంఎఫ్ ఫోన్ 1 బెస్ట్ అని చెప్పవచ్చు.

దేని డిస్‌ప్లే బాగుంది?
మోటో జీ85 5జీలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. సీఎంఎఫ్ ఫోన్ 1లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే ఉంది. కర్వ్‌డ్ డిస్‌ప్లే అంటే అది ఫోన్‌కి మంచి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఫీల్ కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మోటో జీ85 5జీ మళ్లీ స్కోర్ చేసింది.

Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?

బ్యాటరీ, ఛార్జింగ్‌ విషయాల్లో ఏది బెస్ట్?
రెండు ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇవి రెండూ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. కానీ సీఎంఎఫ్ ఫోన్ 1లో మాత్రం 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందించారు. కాబట్టి ఈ సెగ్మెంట్‌లో సీఎంఎఫ్ ఫోన్ 1 ముందంజలో ఉంది.

దేని ధర ఎంత?
సీఎంఎఫ్ ఫోన్ 1 ధర మనదేశంలో రూ.15,999 నుంచి ప్రారంభం కానుంది. మోటో జీ85 5జీ ధర రూ.17,999 నుంచి మొదలవుతుంది. అయితే రెండిట్లోనూ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గానే ఉంది. కాబట్టి ధర విషయంలో రెండూ దాదాపు ఈక్వల్‌గా ఉన్నాయి.

ఏది కొంటే బెస్ట్?
వీటిలో ఏ ఫోన్ కొంటే బెస్ట్ అనేది మాత్రం యూజర్ ఫోన్‌ను ఎక్కువగా దేనికి వాడతారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఫొటోలు ఎక్కువ దిగుతూ... ఫోన్‌ను జస్ట్ బేసిక్‌గా వాడతాం అనుకుంటే మోటో జీ85 5జీ బెస్ట్. కెమెరా కాస్త అటూ ఇటుగా ఉన్నా మంచి ప్రాసెసర్ కావాలి అనుకుంటే సీఎంఎఫ్ ఫోన్ 1కు వెళ్లిపోవచ్చు. కాబట్టి ఒక ఫోన్ కొనేముందు ఆ సెగ్మెంట్‌లో ఏది బెస్ట్ అని కాకుండా మీ యూసేజ్‌కి తగ్గట్లు మంచి ఫోన్ సెలక్ట్ చేసుకుంటే బెటర్. ఈ రెండు ఫోన్లకు కూడా అదే వర్తిస్తుంది. చిన్న, చిన్న అప్స్ అండ్ డౌన్స్ తప్ప రెండూ దాదాపు అన్ని విభాగాల్లోనూ ఈక్వల్‌గానే స్కోర్ చేశాయి.

Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? -  ముగిసిన పోలీసుల కస్టడీ !
కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !
Warangal Crime News: డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
Viral News: ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Embed widget