X

Moto G71 5G: మోటొరోలా బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.19 వేలలోపే.. అదిరిపోయే ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో మోటో జీ71 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.18,999గా ఉంది.

FOLLOW US: 

మోటొరోలా జీ71 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన తాజా 5జీ ఫోన్ ఇదే. ఇందులో హోల్ పంచ్ డిజైన్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇది ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ, రియల్‌మీ 8ఎస్ 5జీ, రియల్‌మీ నార్జో 30 5జీ, ఐకూ జెడ్3 స్మార్ట్ ఫోన్లకు ఇది పోటీ ఇవ్వనుంది.

మోటో జీ71 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. ఆర్కిటిక్ బ్లూ, నెఫ్ట్యూన్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జనవరి 19వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది.

మోటో జీ71 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W టర్బోపవర్ చార్జర్‌ను ఫోన్‌తో పాటు అందించనున్నారు. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Motorola Moto New Phone Moto New 5G Phone Moto G71 5G Moto G71 5G Specifications Moto G71 5G Features Moto G71 5G Launched Moto G71 5G Price in India

సంబంధిత కథనాలు

Boat Airdopes 181: రూ.1,499కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లు!

Boat Airdopes 181: రూ.1,499కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లు!

OnePlus Y1S TV Series: వన్‌‌ప్లస్ స్మార్ట్‌టీవీలు వచ్చేస్తున్నాయి.. రూ.25 వేలలోపే!

OnePlus Y1S TV Series: వన్‌‌ప్లస్ స్మార్ట్‌టీవీలు వచ్చేస్తున్నాయి.. రూ.25 వేలలోపే!

Whatsapp Group Rules: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు వార్నింగ్.. ఇవి చేస్తే జైలుకే!

Whatsapp Group Rules: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు వార్నింగ్.. ఇవి చేస్తే జైలుకే!

Great Republic Day Sale: లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్‌.. ఎక్కువ అమ్ముడవుతున్న ఫోన్లు ఇవే!

Great Republic Day Sale: లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్‌.. ఎక్కువ అమ్ముడవుతున్న ఫోన్లు ఇవే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

టాప్ స్టోరీస్

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్‌! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్‌ స్టైల్‌ చూడండి!

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?