అన్వేషించండి

Moto G45 5G: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - మోటో జీ45 5జీ వచ్చేసింది!

Moto G45 5G Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే మోటో జీ45 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉంది.

Best 5G Phone Under Rs 10000: మోటో జీ45 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్‌తో మోటో జీ సిరీస్‌లో ఇది మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 20W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 

మోటో జీ45 5జీ ధర (Moto G45 5G Price in India)
మోటో జీ45 5జీలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మాజెంటా కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మోటొరోలా అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 28వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.

లాంచ్ ఆఫర్ కింద యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో దీన్ని కొనుగోలు చేసిన వారికి ఇంకో రూ.1,000 తగ్గింపు లభించనుంది. దీంతో బేస్ వేరియంట్‌ను రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు జియో ఆధారిత ఆఫర్లు కూడా అందించనున్నారు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మోటో జీ45 5జీ స్పెసిఫికేషన్లు (Moto G45 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ45 5జీ రన్ కానుంది. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తో పాటు మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ హోల్ పంచ్ ఎల్సీడీ డిస్‌ప్లేను చూడవచ్చు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ద్వారా స్క్రీన్‌కు రక్షణ లభించనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సె్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

బ్లూటూత్ వీ5.1, వైఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్,ఎల్టీఈపీపీ, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఐపీ52 రేటెడ్ వాటర్ రిపెల్లెంట్ బిల్డ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, సెన్సార్ హబ్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీంతోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 20W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Pawan Kalyan: తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
Embed widget