News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Moto G Power(2022): 50 మెగాపిక్సెల్ కెమెరాతో మోటో కొత్త ఫోన్.. ధర రూ.15 వేల లోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్‌ను అమెరికాలో లాంచ్ చేసింది. అదే మోటో జీ పవర్ (2022).

FOLLOW US: 
Share:

మోటో జీ పవర్(2022) స్మార్ట్ ఫోన్ అమెరికాలో లాంచ్ అయింది. ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ (2021)కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరాను అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

మోటో జీ పవర్ (2022) ధర
ఈ ఫోన్ ధర 199 డాలర్లుగా(సుమారు రూ.14,700) ఉంది. దీనికి సంబంధించిన అన్‌లాక్డ్ మోడల్ బెస్ట్ బై, అమెజాన్, మోటొరోలా యూఎస్ వెబ్‌సైట్లలో 2022 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. ఇందులో కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

మోటో జీ పవర్ (2022) స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. వెనకవైపు ఫ్లాష్ కూడా ఉంది. హైపర్‌ల్యాప్స్, డ్యూయల్ క్యాప్చర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ5, వైఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. దీని మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 03:56 PM (IST) Tags: Moto New Phone Moto G Power(2022) Moto G Power(2022) Price Moto G Power(2022) Specifications Moto G Power(2022) Features Moto G Power(2022) Launched

ఇవి కూడా చూడండి

iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!

iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!

Whatsapp: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!

Whatsapp: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!

Upcoming Mobiles: ఒకే రోజున ఐదు ఫోన్లు లాంచ్ - అక్టోబర్ 4న మొబైల్స్ పండగ!

Upcoming Mobiles: ఒకే రోజున ఐదు ఫోన్లు లాంచ్ - అక్టోబర్ 4న మొబైల్స్ పండగ!

Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?

Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?

Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!

Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!

టాప్ స్టోరీస్

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణ అరెస్టు, విశాఖ నుంచి గుంటూరుకు తరలింపు!

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణ అరెస్టు, విశాఖ నుంచి గుంటూరుకు తరలింపు!

Car At YSRCP Office: వైసీపీ వాళ్లు రూ.16 కోట్లు మోసం! జగనన్న న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి- కారుకు స్టిక్కర్లు

Car At YSRCP Office: వైసీపీ వాళ్లు రూ.16 కోట్లు మోసం! జగనన్న న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి- కారుకు స్టిక్కర్లు

వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు, బట్టలు విప్పితే చాలు - ‘ఊసరవెల్లి’ నటి కామెంట్స్

వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు, బట్టలు విప్పితే చాలు - ‘ఊసరవెల్లి’ నటి కామెంట్స్

Supreme Court: రేపే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - ఈ ధర్మాసనం వద్ద లిస్టింగ్

Supreme Court: రేపే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - ఈ ధర్మాసనం వద్ద లిస్టింగ్