News
News
వీడియోలు ఆటలు
X

Xiaomi 13 Pro Price Cut: ఈ షావోమీ ఫోన్‌పై రూ.10 వేలు డిస్కౌంట్ - ఇప్పుడు ఎంత తక్కువంటే?

షావోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.10 వేల వరకు తగ్గించారు.

FOLLOW US: 
Share:

షావోమీ 13 ప్రో ధరను మనదేశంలో భారీగా తగ్గించారు. దీని ధరను మనదేశంలో ఏకంగా రూ.10 వేల వరకు తగ్గించారు. ఈ ఫోన్‌లో ఏకంగా ఒక అంగుళం సైజులో ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

షావోమీ 13 ప్రో ధర
ఇందులో కేవలం 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.79,999గా నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎంఐ ఫ్యాన్ ఫెస్ట్‌లో దీని ధరను రూ.71,999కే తగ్గించారు. మరిన్ని లాయల్టీ డిస్కౌంట్లను కూడా కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ.69,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా రూ.10 వేల తగ్గింపును అందించారన్న మాట.

షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 4820 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను షావోమీ 13 ప్రో సపోర్ట్ చేయనుంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... లెయికా బ్రాండెడ్ కెమెరాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.73 అంగుళాల ఓఎల్ఈడీ 2కే డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కూడా అందించారు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

దీనికి పోటీనిచ్చే వివో ఎక్స్90 ప్రో ప్లస్ విషయానికి వస్తే... ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్‌లో 6.78 అంగుళాల 2కే ఈ6 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వివో ఎక్స్90 ప్రో ప్లస్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో ఎక్స్90 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ జీస్ వన్ ఇంచ్ సెన్సార్‌ను అందించారు. దీని వెడల్పు ఒక అంగుళం ఉండనుందన్న మాట. దీంతో పాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌‌ను వివో ఎక్స్90 ప్రో ప్లస్ సపోర్ట్ చేయనుంది. 5జీని కూడా వివో ఎక్స్90 ప్రో ప్లస్ సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు. దీని బరువు 221 గ్రాములుగా ఉంది.

Published at : 13 Apr 2023 08:22 PM (IST) Tags: Xiaomi 13 Pro Xiaomi 13 Pro Features Xiaomi 13 Pro Price in India Xiaomi 13 Pro Price Cut Xiaomi 13 Pro Price Drop

సంబంధిత కథనాలు

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

Samsung Galaxy A14: రూ.14 వేలలోపే కొత్త స్మార్ట్ ఫోన్ - శాంసంగ్ కొత్త బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!

Samsung Galaxy A14: రూ.14 వేలలోపే కొత్త స్మార్ట్ ఫోన్ - శాంసంగ్ కొత్త బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!

Sanchar Saathi: పోయిన ఫోన్‌ను కనిపెట్టే సంచార్‌ సాథి పోర్టల్‌ను ఉపయోగించడం ఎలా?

Sanchar Saathi: పోయిన ఫోన్‌ను కనిపెట్టే సంచార్‌ సాథి పోర్టల్‌ను ఉపయోగించడం ఎలా?

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!