By: ABP Desam | Updated at : 11 Aug 2022 07:54 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో వీ25 ప్రో ఆగస్టు 17వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది.
వివో మనదేశంలో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టు 17వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో వీ25 సిరీస్‌లో మొదటగా లాంచ్ కానున్న ఫోన్ వివో వీ25 ప్రోనే. ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-షాప్, వివో స్టోర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
వివో వీ25 ప్రో మనదేశంలో ఆగస్టు 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. వివో వీ25 సిరీస్‌లో రెండు ఫోన్లు ఉండనున్నాయి. అవే వివో వీ25, వివో వీ25 ప్రో. ప్రస్తుతానికి ఇందులో వివో వీ25 ప్రో మాత్రమే విడుదల కానుంది.
వివో వీ25 ప్రో వివరాలు
ఈ స్మార్ట్ ఫోన్‌లో కలర్ ఛేంజింగ్ బ్యాక్ డిజైన్ ఉండనుందని వివో ఇప్పటికే ప్రకటించింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించనున్నారు. వ్లాగింగ్, నైట్ వీడియోగ్రఫీ కోసం హైబ్రిడ్ వీడియో స్టెబిలేషన్ కూడా అందించారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4830 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను వివో వీ25 ప్రో సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇక ధర విషయానికి వస్తే దీని ధర రూ.40 వేల నుంచి ప్రారంభం కానుంది. ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.
వివో ఇటీవలే తన రెండు స్మార్ట్ ఫోన్ల ధరను మనదేశంలో తగ్గించింది.అవే వివో వీ23ఈ, వివో వై21టీ. వీటిలో వివో వీ23ఈ 5జీ ధర రూ.24,999 నుంచి ప్రారంభం కానుంది. వివో వై21టీను రూ.15,499కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు కొత్త ధరలకే అందుబాటులో ఉన్నాయి. వివో వీ23ఈ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లోనూ, వివో వై21టీ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లోనూ లాంచ్ అయ్యాయి.
వివో బడ్జెట్ ఫోన్ టీ1ఎక్స్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై వివో టీ1ఎక్స్ పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!
Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!
Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు
Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?
/body>