అన్వేషించండి

Tecno Pova Neo 2: 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో కొత్త ఫోన్ - రూ.12 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే టెక్నో పోవా నియో 2.

టెక్నో పోవా నియో 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఈ స్మార్ట్ ఫోన్ సైబర్ బ్లూ, యూరానోలిత్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

4 జీబీ, 6 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో 6.82 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనుంది. దీని ఫీచర్లను బట్టి చూస్తే ధర రూ.12 వేలలోపే ఉండనుంది.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో అందించనున్నారు.

టెక్నో మనదేశంలో స్పార్క్ 9టీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధరను రూ.9,799గా నిర్ణయించారు. టర్కోయిస్ సియాన్, అట్లాంటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 9టీని కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ357 ప్రాసెసర్ కూడా ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. స్టోరేజ్‌లో నుంచి 3 జీబీని వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే 7 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Sports Calender 2025 Update: చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Embed widget