అన్వేషించండి

Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన పోవా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్‌ను మే 25వ తేదీన లాంచ్ చేయనుంది.

టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ మే 25వ తేదీన గ్లోబల్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. దీనికి ముందు వెర్షన్ టెక్నో పోవా 2 కూడా గ్లోబల్ మార్కెట్లో గతేడాది లాంచ్ అయింది. టెక్నో పోవా 3 ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ప్రకారం ఈ ఫోన్ ధర 8,999 ఫిలిప్పీన్స్ పెసోల (మనదేశ కరెన్సీలో రూ.13,499) నుంచి 9,399 ఫిలిప్పీన్స్ పెసోల (సుమారు రూ.13,999) మధ్య ఉండనుంది.

దీని ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫొటోలను బట్టి చూస్తే ఎలక్ట్రిక్ బ్లూ, టెక్ సిల్వర్, ఎకో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా చూడవచ్చు. ఫోన్ ముందువైపు మధ్యభాగంలో సెల్ఫీ కెమెరా ఉండనుంది. దీంతోపాటు కుడివైపు వాల్యూమ్ రాకర్లు, ఎడమవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది.

టెక్నో పోవా 3 స్పెసిఫికేషన్లు (అంచనా)
లీకైన వివరాల ప్రకారం... ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ ఇన్ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2460 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్లు ఉండనున్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనుంది.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు మరో రెండు సెన్సార్లు అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ మందం 0.94 సెంటీమీటర్లుగా ఉండనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by GadBud PH (@gadbudph)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Jobs In Grok: Elon Muskతో పనిచేసే అవకాశం, టాలంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Elon Muskతో పనిచేసే అవకాశం, టాలంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Medchal Latest News: బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
Embed widget