News
News
X

Samsung Galaxy M52 5G: ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ.9 వేలకు పైగా తగ్గింపు - ఇప్పుడు రూ.20 వేలలోపే!

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ భారీ తగ్గింపును అందించింది. దీంతో ఈ ఫోన్ రూ.20 వేలలోపే అందుబాటులో ఉంది.

FOLLOW US: 
Share:

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు ఇందులో పంచ్ హోల్ డిజైన్ కూడా ఉండనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 నుంచి రూ.20,999కు తగ్గింది. ఈ ఆఫర్ ప్రస్తుతానికి రిలయన్స్ డిజిటల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతోపాటు సిటీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,500 తగ్గింపు లభించనుంది. అంటే రూ.20 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనేయచ్చన్న మాట. బ్లేజింగ్ బ్లూ, ఐసీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లే అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. దీంతోపాటు యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉండనున్నాయి. దీని మందం 0.74 సెంటీమీటర్లుగానూ, బరువు 173 గ్రాములుగానూ ఉండనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 24 Jun 2022 02:57 PM (IST) Tags: Samsung Galaxy M52 5G Samsung Galaxy M52 5G Price in India Samsung Galaxy M52 5G Price Cut Samsung Galaxy M52 5G Price Drop Samsung M52 5G

సంబంధిత కథనాలు

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!