అన్వేషించండి

Oppo F21 Pro: ఒప్పో ఎఫ్21 ప్రో వచ్చేసింది - అదిరిపోయే డిజైన్, సూపర్ కెమెరా - ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను బంగ్లాదేశ్‌లో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఎఫ్21 ప్రో.

ఒప్పో ఎఫ్21 ప్రో స్మార్ట్ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. కంపెనీ ఎఫ్-సిరీస్ లైనప్‌లో ఇది లేటెస్ట్ మోడల్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఇందులో 6.43 ఇంచుల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 64 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

ఒప్పో ఎఫ్21 ప్రో ధర
దీని ధరను 27,990 బంగ్లాదేశ్ టాకాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.24,640) నిర్ణయించారు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. కాస్మిక్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో రేపు (ఏప్రిల్ 12వ తేదీ) లాంచ్ కానుంది.

ఒప్పో ఎఫ్21 ప్రో స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. 8 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. ర్యామ్‌ను మరో 5 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, యాక్సెలరో మీటర్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, పీడోమీటర్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా... బరువు 175 గ్రాములుగా ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
YSRCP Chief YS Jagan : చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి మాటకు ఏం విలువ ఉంటుంది: జగన్
చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి మాటకు ఏం విలువ ఉంటుంది: జగన్
Jeevan Reddy: జీవన్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ రెండు ముక్కలు కానుందా!, సిఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి
జీవన్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ రెండు ముక్కలు కానుందా!, సిఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్ వచ్చేసింది
Advertisement

వీడియోలు

Mumbai Indians Playoffs IPL 2025 | ముంబై ఎంట్రీ ఇచ్చిందంటే అపోజిషన్ల పొజిషన్స్ గల్లంతేSurya Kumar Yadav POTM vs DC IPL 2025 | భార్య కోసం అవార్డు గెలిచిన SKYDelhi Capitals performance IPL 2025 | ఢిల్లీ మొదలుకు..ముగింపునకు సంబంధమే లేదుMI vs DC Match Highlights IPL 2025 | పదకొండోసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముంబై ఇండియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
YSRCP Chief YS Jagan : చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి మాటకు ఏం విలువ ఉంటుంది: జగన్
చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి మాటకు ఏం విలువ ఉంటుంది: జగన్
Jeevan Reddy: జీవన్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ రెండు ముక్కలు కానుందా!, సిఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి
జీవన్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ రెండు ముక్కలు కానుందా!, సిఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్ వచ్చేసింది
Supreme Court On ED: తమిళనాడు లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు నిలిపివేత - తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడు లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు నిలిపివేత - తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
YS Jagan: 'జూన్‌ 4న వెన్నుపోటు దినం'-కూటమి సర్కారుపై జగన్‌ ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇదే!
'జూన్‌ 4న వెన్నుపోటు దినం'-కూటమి సర్కారుపై జగన్‌ ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇదే!
Bangalore Memes: బెంగళూరును ముంచెత్తిన వర్షాలు - జోకులతో ఆడుకున్న నెటిజన్లు - వైరల్ మీమ్స్
బెంగళూరును ముంచెత్తిన వర్షాలు - జోకులతో ఆడుకున్న నెటిజన్లు - వైరల్ మీమ్స్
Payyavula Keshav: మద్యం ఆరోగ్యానికి హానికరం- వైసీపీ పాలన రాష్ట్రానికి హానికరం: పయ్యావుల కేశవ్‌
మద్యం ఆరోగ్యానికి హానికరం- వైసీపీ పాలన రాష్ట్రానికి హానికరం: పయ్యావుల కేశవ్‌
Embed widget