By: ABP Desam | Updated at : 12 Jul 2022 01:17 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
నోకియా జీ11 ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది..
నోకియా మనదేశంలో ఈరోజు (జులై 12వ తేదీ) కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇది బడ్జెట్ ధరలోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది నోకియా జీ11 ప్లస్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన టీజర్లను నోకియా మూడు రోజుల నుంచి షేర్ చేస్తుంది.
ఈ టీజర్ల ప్రకారం చూస్తే ఈ ఫోన్ సైడ్స్ ఫ్లాట్‌గా ఉండనున్నాయి. వెనకవైపు రెండు కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. గతంలో లాంచ్ అయిన నోకియా జీ11 ప్లస్‌కు కూడా ఫోన్ వెనకవైపే వెనకవైపు ఉన్నాయి. నోకియా జీ11 ప్లస్‌కు కూడా వెనకవైపు రెండు కెమెరాలే ఉన్నాయి.
నోకియా జీ11 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ప్రాసెసర్ వివరాలు తెలియరాలేదు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనక భాగంలో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 192 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?
50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Realme GT Neo 3T: వావ్ అనిపించే కొత్త ఫోన్ తీసుకురానున్న రియల్‌మీ - ఆ ఒక్కటే సస్పెన్స్!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Realme 9i 5G: రూ.14 వేలలోపే రియల్‌మీ 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు