![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Micromax In 2C Sale: మైక్రోమ్యాక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.7,500 లోపే - ఎలా ఉందో చూశారా?
మైక్రోమ్యాక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ ఇన్ 2సీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
![Micromax In 2C Sale: మైక్రోమ్యాక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.7,500 లోపే - ఎలా ఉందో చూశారా? Micromax In 2C Sale Started in India Check Price Offers Features Micromax In 2C Sale: మైక్రోమ్యాక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.7,500 లోపే - ఎలా ఉందో చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/02/c2674f2273fcfb7f75dbaa0bc946b20e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మైక్రో మ్యాక్స్ ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన ఇన్ 2సీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.
మైక్రో మ్యాక్స్ ఇన్ 2సీ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందించారు. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ.7,499కే కొనుగోలు చేయవచ్చు. బ్రౌన్, సిల్వర్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం అయింది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2సీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌పై మైక్రోమ్యాక్స్ ఇన్ 2సీ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ బ్యూటీ, నైట్ మోడ్, పొర్‌ట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా... బరువు 198 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)