News
News
X

Jio 5G: నాలుగు రోజుల్లోనే జియో 5జీ ఫోన్ లాంచ్? - 5జీ సర్వీస్ కూడా అదే రోజు?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జియో 5జీ ఫోన్, 5జీ సర్వీసులు త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

జియో 5జీ సర్వీస్, జియోఫోన్ 5జీ స్మార్ట్ ఫోన్లను త్వరలో జరగనున్న వార్షిక జనరల్ మీటింగ్‌లో (ఏజీయం) లాంచ్ చేసే అవకాశం ఉంది. జియో 45వ ఏజీయం ఆగస్టు 29వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమంలో కంపెనీ బోలెడన్ని ప్రకటనలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జియో 5జీ, జియోఫోన్ 5జీ కూడా ఆ మీటింగ్‌లోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

5జీ రోల్ అవుట్ మనదేశంలో అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. జియో 5జీ త్వరలో లాంచ్ కానుంది కాబట్టి జియోఫోన్ 5జీ కూడా మనదేశంలో ఆరోజే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 5జీ స్పెక్ట్రం వేలంలో అందరి కంటే ఎక్కువ ఖర్చు పెట్టింది జియోనే. దాదాపు 11 బిలియన్ డాలర్లను (సుమారు రూ.87 వేల కోట్లు) జియో వేలంలో ఖర్చు పెట్టింది.

జియో 5జీ ఫోన్ ధర రూ.9,000 నుంచి రూ.12,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. దీన్ని లాంచ్ చేసినప్పుడు ఫోన్ ధర గురించి క్లారిటీ రానుంది.  జియో ఫోన్ 5జీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను జనాల ముందుకు తెచ్చేందుకు జియో ప్రయత్నిస్తుంది. 

జియో 2017లో తొలి ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ కు జనాల నుంచి మంచి ఆదరణ లభించింది. గతేడాది 4జీ స్మార్ట్ ఫోన్ కూడా జియో లాంచ్ చేసింది. జియో 5జీ ఫోన్ ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

జియో 5జీ ఫోన్  స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 
జియో 5G స్మార్ట్ ఫోన్  హెచ్‌డీ+ రిజల్యూషన్‌ స్క్రీన్‌తో రానుంది. 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  60Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్టు చేస్తుంది.  ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480  5జీ  ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు కొన్ని జియో యాప్ లకు  మాత్రమే సపోర్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో జియో నుంచి వచ్చిన ఫోన్ మాదిరిగానే ఇందులో ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. గూగుల్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ టెక్ట్స్, గూగుల్ లెన్స్, గూగుల్ ట్రాన్స్ లేట్ ఉండనున్నాయి.

ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జియో 5G  ఫోన్ USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ ను కలిగి ఉంటుందట. ఇక ఫోటోలు, వీడియోల కోసం  13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది. ముందు భాగంలో సెల్పీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చినట్లు సమాచారం. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను సైతం అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. 

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 25 Aug 2022 08:25 PM (IST) Tags: Jio New Phone Jio 5G Phone Jio 5G Phone India Launch Jio 5G Reliance 45th AGM Jio 5G Phone Launch

సంబంధిత కథనాలు

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!

Moto G72: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ ఫోన్ - అదిరిపోయే కెమెరా మొబైల్ లాంచ్ చేసిన మోటో!

Moto G72: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ ఫోన్ - అదిరిపోయే కెమెరా మొబైల్ లాంచ్ చేసిన మోటో!

Lava Blaze 5G: ఇదీ ఇండియన్ బ్రాండ్ అంటే - దేశంలోనే అత్యంత 5జీ ఫోన్ లాంచ్ చేసిన లావా!

Lava Blaze 5G: ఇదీ ఇండియన్ బ్రాండ్ అంటే - దేశంలోనే అత్యంత 5జీ ఫోన్ లాంచ్ చేసిన లావా!

Spam Calls: స్పామ్ కాల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? జస్ట్ ఇలా చేస్తే మళ్లీ రావు!

Spam Calls: స్పామ్ కాల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? జస్ట్ ఇలా చేస్తే మళ్లీ రావు!

WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి ‘స్క్రీన్‌ షాట్ బ్లాకింగ్' ఫీచర్‌!

WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి ‘స్క్రీన్‌ షాట్ బ్లాకింగ్' ఫీచర్‌!

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?