Itel S23: 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్ - ధర మాత్రం రూ.9 వేలలోపే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఐటెల్ ఎస్23.
ఐటెల్ ఎస్23 స్మార్ట్ ఫోన్ మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఐటెల్ ఎస్23 పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ర్యామ్‌ను స్టోరేజ్ నుంచి వర్చువల్‌గా మరో 8 జీబీ పెంచుకోవచ్చు. అంటే 16 జీబీ ర్యామ్ అందించనున్నారన్న మాట. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు.
ఐటెల్ ఎస్23 ధర
ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,799గా నిర్ణయించారు. ఇందులో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కానీ ఈ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. మిస్టరీ వైట్, స్టారీ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జూన్ 14వ తేదీ నుంచి అమెజాన్‌లో ఐటెల్ ఎస్23ని విక్రయించనున్నారు.
ఐటెల్ ఎస్23 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ అందించారు. కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌ను ఉండటం విశేషం. సూర్య కాంతి లేదా అల్ట్రా వయొలెట్ కిరణాల్లో ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగులు మారనుంది.
ఆక్టాకోర్ 12 నానో మీటర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీని అందించారు. దీని ద్వారా స్టోరేజ్‌ను ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మెమొరీని 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 128 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్ అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W వైర్డ్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 15 గంటల బ్యాటరీ లైఫ్ డెలివర్ చేయనుంది.
ఐటెల్ మనదేశంలో ఇటీవలే మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే ఐటెల్ ప్యాడ్ వన్. ఈ సంవత్సరం ప్రారంభంలో ఐటెల్ ఎల్ సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా మనదేశంలో లాంచ్ చేసింది. ఇవి మనదేశంలో 4జీ కాలింగ్‌ను కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఇందులో లార్జ్ డిస్‌ప్లే, ఇతర అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా అందించనున్నారు. సూపర్ ఫాస్ట్ 4జీ వోల్టే టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
లైట్ బ్లూ, డీప్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ట్యాబ్ కొనుగోలు చేయవచ్చు. దీని ధర మనదేశంలో రూ.12,999గా ఉంది. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఐటెల్ ప్యాడ్ వన్ అందుబాటులో ఉండనుంది. మనదేశంలో అందుబాటులో ఉన్న చవకైన ట్యాబ్లెట్ ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. ఆన్‌లైన్ క్లాసులకు ఇది బాగా ఉపయోగపడనుంది.
Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?