iPhone 14 Series Sale: ఐఫోన్ 14 సేల్ మొదలైపోయింది - ఒక్క మోడల్ తప్ప అన్నీ అందుబాటులోనే!
ఐఫోన్ 14 సిరీస్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అయితే ఐఫోన్ 14 ప్లస్ సేల్ మాత్రం అక్టోబర్ 7వ తేదీ నుంచి జరగనుంది.
ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతానికి ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల సేల్ మాత్రమే ప్రారంభం అయింది. ఐఫోన్ 14 ప్లస్ సేల్ మాత్రం అక్టోబర్ 7వ తేదీ నుంచి జరగనుంది.
ఐఫోన్ 14 సిరీస్ ధర
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర మనదేశంలో రూ.1,29,990గా ఉంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రారంభ వేరియంట్ ధర రూ.1,39,990గా ఉంది. 128 జీబీ నుంచి 1 టీబీ వరకు వేర్వేరు వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
ఐఫోన్ 14 బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలిసిపోతాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.
ఐఫోన్ 14 ప్రో స్పెసిఫికేషన్లు
ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే... వీటిలో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించారు. ఐఫోన్ 14 ప్రోలో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ముందువైపు పిల్ ఆకారంలో ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను ఐఫోన్ 14 ప్రోలో యాపిల్ అందించింది. దీనికి డైనమిక్ ఐల్యాండ్ అని పేరు కూడా పెట్టారు. యాపిల్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా యాపిల్ అందించింది.
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
దీని ఫీచర్లు దాదాపుగా ఐఫోన్ 14 ప్రో తరహాలోనే ఉన్నాయి. అయితే ఇందులో దాని కంటే పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే సైజు 6.7 అంగుళాలుగా ఉంది. ప్రో మోషన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?