By: ABP Desam | Updated at : 13 Apr 2022 10:33 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. (Image Credits: OnLeaks)
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ గత కొంతకాలం నుంచి వార్తల్లో ఉంటూ వస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి గూగుల్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే గూగుల్ పిక్సెల్ 6ఏతో పాటు గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను కూడా కంపెనీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లూ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) వెబ్‌సైట్‌లో కనిపించాయి.
గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించనుంది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ కూడా ఈ సంవత్సరమే లాంచ్ కానుంది. ఇక గూగుల్ పిక్సెల్ 6ఏ మాత్రం మే నెలలో జరగనున్న గూగుల్ ఐవో 2022 సదస్సులో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఎఫ్‌సీసీ లిస్టింగ్‌లో కూడా ఈ ఫోన్ కనిపించింది. జీఎక్స్7ఏఎస్, జీబీ17ఎల్, జీబీ62జెడ్, జీ1ఏజెడ్‌జీ మోడల్ నంబర్లతో చాలా గూగుల్ ఫోన్లు ఈ లిస్టింగ్‌లో కనిపించాయి. ఇవి గూగుల్ పిక్సెల్ 6ఏ లేదా గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌లో భాగం అయ్యే అవకాశం ఉంది.
వీటిలో జీఎక్స్7ఏఎస్ మోడల్ ఉన్న స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 6ఏ వేరియంట్ అని సమాచారం. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్లలో 5జీ, ఎల్టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, వైఫై 6ఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ గతంలో లాంచ్ అయిన పిక్సెల్ 5ఏ 5జీకి తర్వాతి వేరియంట్‌గా లాంచ్ కానుంది. ఈ ఫోన్ గతంలో గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. గూగుల్ టెన్సార్ జీఎస్101 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ రానుందని సమాచారం.
ఫోన్ వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. బ్లాక్, గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సెల్ఫీ కెమెరా కోసం ఇందులో హోల్ పంచ్ కెమెరా ఉండనుంది. 6.2 అంగుళాల డిస్‌ప్లేను గూగుల్ ఇందులో అందించనుంది. 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
iPhone 14 Series: ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - చైనా మళ్లీ ముంచేసిందిగా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?