Smartphones Under 10,000 : కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? 10,000 లోపు బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్లు ఇవే
Top Budget Smartphones : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? 10,000 లోపు అద్భుత ఫీచర్లతో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఏయే ఫోన్.. ఏయే ఫీచర్‌తో వస్తుందో చూసేద్దాం.

Best Smartphones Below 10,000 : కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మీరు 2026లో మీ కోసం కొత్త ఫోన్ కొనాలనుకుంటే మార్కెట్లో చాలా అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధర ఎక్కువగా ఉండొచ్చు. కానీ బడ్జెట్ ఎక్కువగా లేకపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనేక శక్తివంతమైన ఫీచర్లతో కూడిన ఫోన్లు బడ్జెట్ రేంజ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. 10,000 రూపాయల లోపు స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇప్పుడు చూసేద్దాం. వాటిలో మీకు అద్భుతమైన ఫీచర్లు ఉన్న నచ్చిన ఫోన్ ఎంచుకోవచ్చు.
Samsung Galaxy M06 5G
ఈ ఫోన్ 6.7 అంగుళాల LCD డిస్‌ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. దీనికి 4GB RAM జతచేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 MP + 2 MP సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 MP కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ 9,999 రూపాయలకు లిస్ట్ అయింది.
Redmi 14C 5G
Redmi ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉంది. దీనికి 4GB RAM జతచేశారు. దీని వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8MP ఫ్రంట్ లెన్స్ ఇచ్చారు. 5160mAh బ్యాటరీతో కూడిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 9,499 రూపాయలకు లిస్ట్ అయింది.
MOTOROLA g35 5G
ఈ ఫోన్ 6.72 అంగుళాల Full HD+ డిస్‌ప్లేతో వస్తుంది. దీని వెనుక భాగంలో 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP లెన్స్‌తో ఇచ్చారు. ఇందులో Unisoc T760 ప్రాసెసర్ ఉంది. దీనికి 4 GB RAM జతచేశారు. దీని స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించవచ్చు. Motorola ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 9,999 రూపాయలకు అందుబాటులో ఉంది.
POCO M7 5G
ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. దీని వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP లెన్స్ ఇచ్చారు. ఈ ఫోన్ 5,160 mAh బ్యాటరీతో లాంచ్ అయింది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో 8,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.






















