అన్వేషించండి

iPhone Camera: ఐఫోన్లలో వాడే కెమెరాలు ఇవే - మొదటిసారి ప్రకటించిన యాపిల్ సీఈవో!

ఐఫోన్లలో గత 10 సంవత్సరాల నుంచి సోనీ కెమెరాలు వాడుతున్నట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.

యాపిల్ తన ఐఫోన్లలో వాడే హార్డ్ వేర్ గురించి ఎక్కువ వివరాలను బయటకు వెల్లడించింది. కానీ ఇప్పుడు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ కెమెరా గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఐఫోన్లలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సోనీ కెమెరాలు వాడుతున్నట్లు తెలిపారు. ఐఫోన్ కెమెరా రిజల్యూషన్, జనరిక్ ఇన్ఫర్మేషన్ గురించి తప్ప మిగతా వివరాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

‘దాదాపుగా ఒక సంవత్సరం నుంచి సోనీతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ కెమెరాలు అందించడానికి అదే కారణం.’ అని టిమ్ కుక్ ట్వీట్ చేశారు. సోనీ సీఈవో కెనిచిరో యోషిదాతో కలిసి దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.

ఐఫోన్ 15 సిరీస్‌కు సంబంధించిన ఫీచర్లు కూడా ఇప్పటికే లీకుల ద్వారా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న లీకుల ప్రకారం ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనుంది. ప్రస్తుతం ప్రో మోడల్స్‌లో అందుబాటులో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా అందించనున్నారు. ఐఫోన్ 15, 15 ప్లస్‌ల్లో ఏ16 బయోనిక్, ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ల్లో ఏ17 బయోనిక్ ప్రాసెసర్లు ఉండనున్నాయి.

ఇప్పుడు వినిపిస్తున్న లీకుల ప్రకారం ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. 6.7 అంగుళాల ప్రో మోడల్ పేరును ‘అల్ట్రా’ అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ కంటే ఐఫోన్ 15 సిరీస్ ఖరీదు చాలా ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఏకంగా 1,199 డాలర్ల (సుమారు రూ.95,000) నుంచి దీని ధర ప్రారంభం కానుందని సమాచారం.

ఐఫోన్ 15 మోడల్స్‌లో లైట్‌నింగ్ పోర్టు బదులు యూఎస్‌బీ టైప్-సీ పోర్టును యాపిల్ అందించనుందని వార్తలు వస్తున్నాయి. అన్ని డివైస్‌లకు ఒకే చార్జింగ్ పోర్టు ఉండాలన్న యూరోపియన్ యూనియన్ నిర్ణయం కారణంగా యాపిల్ కూడా పోర్టును మార్చక తప్పడం లేదు.

ప్రస్తుతం కేవలం ప్రో మోడల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ త్వరలో అన్ని ఐఫోన్ మోడళ్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్లలో ఏ17 బయోనిక్ ప్రాసెసర్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లలో ఏ16 బయోనిక్ ప్రాసెసర్ ఉండనుంది.

దీంతోపాటు కెమెరా విషయంలో కూడా యాపిల్ బోలెడన్ని అప్‌గ్రేడ్లు చేయనుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం రానున్న ఐఫోన్ 15 లైనప్‌లో 8కే వీడయో రికార్డింగ్ ఫీచర్ ఉండనుంది. అయితే ఇవి అల్ట్రా, ప్రో వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయా లేకపోతే అన్ని వేరియంట్లకు వస్తాయా అనేది తెలియరాలేదు. దీంతోపాటు బ్యాటరీ లైఫ్‌ను కూడా మూడు నుంచి నాలుగు గంటలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget