Jio ISD Plans: రూ.39కే ఇంటర్నేషనల్ కాలింగ్ - కొత్త ప్లాన్లు తెచ్చిన జియో!
Jio New ISD Plans: రిలయన్స్ జియో తన ఇంటర్నేషనల్ ప్లాన్లను రీవ్యాంప్ చేసింది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఐఎస్‌డీ ప్లాన్లు రూ.39 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. రకరకాల ధరల్లో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
Reliance Jio ISD Plans: టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించింది. ఇప్పుడు కేవలం రూ.39 నుంచి జియో ఐఎస్‌డీ ప్లాన్లు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ప్లాన్లు ఏడు రోజుల పాటు ప్రత్యేక నిమిషాలను అందిస్తాయి. ఈ ఐఎస్‌డీ మినిట్స్ అత్యంత తక్కువ ధరలకు లభిస్తాయని జియో పేర్కొంది. జియో... బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియాలకు ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్‌ల రేట్లను సవరించింది.
రిలయన్స్ జియో కొత్త ఐఎస్‌డీ ప్లాన్లు
అమెరికా, కెనడా కోసం రిలయన్స్ జియో ఐఎస్‌డీ ప్లాన్లు రూ.39తో ప్రారంభం అవుతుంది. ఇది ఏడు రోజుల పాటు 30 నిమిషాల టాక్ టైమ్‌ను అందిస్తుంది. బంగ్లాదేశ్‌కు రూ.49కి ప్లాన్ ఉంది. సింగపూర్, థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్‌లకు రూ.59 ప్లాన్ ఉంది. రూ.49 ప్లాన్ 20 నిమిషాలు, రూ.59 ప్లాన్ 15 నిమిషాల టాక్ టైమ్‌ను అందిస్తుంది.
ఇది కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు రూ.69 రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఇది 15 నిమిషాల టాక్ టైమ్‌ను అందిస్తుంది. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లకు రూ.79 రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఇది 10 నిమిషాల టాక్ టైమ్‌ను అందిస్తుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
రిలయన్స్ జియో కొత్త రూ.1,028, రూ.1,029 ప్లాన్లు
ఇటీవల రిలయన్స్ కొన్ని ఉచిత ప్రయోజనాలతో రూ. 1,028, రూ. 1,029 కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. రూ. 1,028 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్, రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. ఇది కాకుండా జియో 5జీ సర్వీసు అందుబాటులో ఉన్న చోట ఉచిత 5జీ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా స్విగ్గీ వన్ లైట్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్‌ల ఉచిత సభ్యత్వం కూడా అందించబడుతుంది.
అదే సమయంలో రూ.1,029 ప్లాన్ కూడా దాదాపు రూ.1,028 ప్లాన్‌తో సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అంటే 84 రోజుల వ్యాలిడిటీ 100 ఎస్ఎంఎస్, రోజుకు 2 జీబీ డేటాతో అపరిమిత 5జీ కనెక్టివిటీని అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో వినియోగదారులు జియో యాప్‌లతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సభ్యత్వాన్ని కూడా పొందుతారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
1 million reasons to connect
— Reliance Jio (@reliancejio) October 11, 2024
1 million reasons for happiness
1 million strong on X
Thank you for being part of the journey 💙#WithLoveFromJio #1MillionStrong
Join us at India Mobile Congress 2024 as we step into the future of technology. Jio is proud to be at the heart of this revolution, driving progress and innovation for a new Bharat. 🇮🇳
— Reliance Jio (@reliancejio) October 7, 2024
We hope to see you there! #WithLoveFromJio ♥️#IndiaMobileCongress #TheFutureIsNow #IMC2024… pic.twitter.com/gpoanFHxDs