అన్వేషించండి

Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!

Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.

Jio vs Airtel: భారతీయ టెలికాం వినియోగదారులు క్రమంగా 5జీ నెట్‌వర్క్‌కు అలవాటు పడుతున్నారు. ఎందుకంటే జియో, ఎయిర్‌టెల్ గత కొన్ని నెలలుగా తమ వినియోగదారులకు ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ సేవను అందజేస్తున్నాయి. ఒకవేళ 5జీ ఇంటర్నెట్‌కు మీరు అలవాటు పడితే భవిష్యత్తులో కచ్చితంగా 5జీ ప్లాన్‌ని కొనుగోలు చేయవలసి వస్తుంది.

భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభించి చాలా నెలలు అవుతుంది. ఎయిర్‌టెల్, జియో భారతదేశంలోని రెండు అగ్రగామి టెలికాం కంపెనీలు. ఇవి ఈ దేశంలో మొదట 5జీ సర్వీసును ప్రారంభించాయి. అయితే ఈ రెండు కంపెనీలు ఇంకా 5జీ ప్లాన్‌లను విడుదల చేయలేదు. యూజర్లు అందరికీ కూడా 5జీని ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది వినియోగదారులు ఉచిత 5జీ నెట్‌వర్క్‌ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

5జీ ఉచిత సర్వీసును నిలిపివేయనున్న జియో, ఎయిర్‌టెల్
జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు గత కొన్ని నెలలుగా తమ వినియోగదారులకు 5జీ సర్వీసు ప్రయోజనాలను చూపించడానికి, వాటిని అలవాటు చేయడానికి ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ సౌకర్యాన్ని అందించాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన వినియోగదారులకు 4జీ రీఛార్జిపై ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ సర్వీసు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు దానికి శుభం కార్డు పడనుందట.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అన్‌లిమిటెడ్ 5జీ సర్వీసు త్వరలో ముగియబోతోంది. ఈ నివేదిక ప్రకారం జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు వేర్వేరుగా 5జీ కనెక్టివిటీ ప్లాన్‌లను అందించగలవు. 5జీ ప్లాన్‌ల ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ ప్లాన్‌ల కంటే ఐదు నుంచి 10 శాతం ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ఒక సంవత్సరంలోనే 100 మిలియన్లకు పైగా అంటే 10 కోట్లకు పైగా వినియోగదారులకు చేరుకుంది. అయితే జియో, ఎయిర్‌టెల్ రెండూ తమ వినియోగదారుల నుంచి 5జీ సర్వీసు కోసం ఇంకా ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. ఈ రెండు కంపెనీలు వాటికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన 4జీ ప్లాన్‌లతో పాటు, వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ల సౌకర్యాన్ని ఉచితంగా అందించాయి. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.

5జీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉంటాయి?
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, ఎయిర్‌టెల్ తమ 5జీ ప్లాన్‌లను 2024 ద్వితీయార్ధంలో అందుబాటులోకి తీసుకురావచ్చు.  అంటే 2024 జులై నుంచి డిసెంబర్ మధ్య ఎప్పుడైనా ప్రారంభించవచ్చని టెలికాం పరిశ్రమలోని నిపుణుడు పేర్కొన్నారు.

5జీ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు 10 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. 5జీ ప్లాన్‌లలో 4జీ ప్లాన్‌లతో పోలిస్తే 30% ఎక్కువ ఇంటర్నెట్ డేటా అందించనున్నారట. ప్రస్తుతం 4జీ ప్లాన్‌ల్లో రోజుకు 1.5 జీబీ నుంచి 3 జీబీ వరకు డేటా అందించే ప్లాన్లు ఉన్నాయి. అయితే 5జీ ప్లాన్‌ల్లో రోజుకు 2 జీబీ నుంచి 4 జీబీ వరకు డేటా ప్లాన్ ఇవ్వవచ్చు.

ఇది కాకుండా 2024లో 5జీ ప్లాన్‌లను ప్రారంభించడంతో పాటు కంపెనీలు 4జీ ప్లాన్‌ల రేట్లను కూడా పెంచబోతున్నాయని కూడా ఎకనామిక్ టైమ్స్ నివేదికలో తెలిపింది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget