అన్వేషించండి

iQoo 12: 100x జూమ్‌తో రానున్న ఐకూ కొత్త ఫోన్ - ఇంపార్టెంట్ అప్‌డేట్ వచ్చేసింది!

iQoo 12 Amazon: ఐకూ 12కు సంబంధించిన మైక్రో సైట్ అమెజాన్‌లో లైవ్ అయింది.

iQoo 12 Series: ఐకూ 12 సిరీస్ ఫోన్లు నవంబర్ ఏడో తేదీన గ్లోబల్ లాంచ్ అయ్యాయి. ఈ లైనప్‌లో ఐకూ 12, ఐకూ 12 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఐకూ 12ని మనదేశంలో డిసెంబర్ 12వ తేదీన మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా లైవ్ అయింది. బర్నింగ్ వే, లెజెండ్ ఎడిషన్, ట్రాక్ వెర్షన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో ట్రాక్ వెర్షన్ వేరియంట్ బీఎండబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తో రానుంది.

ఐకూ 12 బేస్ మోడల్‌కు సంబంధించిన మైక్రో సైట్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో లైవ్ అయింది. దీన్ని బట్టి ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని అనుకోవచ్చు. చైనాలో ఈ మొబైల్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.45,000) నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4,299 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.50,000), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4,699 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.53,000) నిర్ణయించారు.

ఐకూ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐకూ 12 స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5కే రిజల్యూషన్, 144 హెర్ట్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ 4ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఫోన్ రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంది. 100X డిజిటల్ జూమ్‌ను ఈ లెన్స్ సపోర్ట్ చేయనుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.

మరోవైపు ఐకూ పేరెంట్ కంపెనీ వివో తన ఎక్స్100 సిరీస్ ఫోన్లు చైనాలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో మొబైల్స్ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లూ 100x జూమ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. ఈ రెండిట్లోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్100 సిరీస్ పని చేయనున్నాయి.

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget