iPhone SE Offer: రూ.14 వేలలోపే ఐఫోన్ - ఇలా చేస్తే కొనేయచ్చు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్!
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (2020)పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.
![iPhone SE Offer: రూ.14 వేలలోపే ఐఫోన్ - ఇలా చేస్తే కొనేయచ్చు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్! iPhone SE 2020 Got Huge Offers in Flipart Know Details iPhone SE Offer: రూ.14 వేలలోపే ఐఫోన్ - ఇలా చేస్తే కొనేయచ్చు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/05/c02bea0cff4244a7f944d4e21bcdb337_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐఫోన్ ఎస్ఈ (2020) 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,998కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అనేక ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మార్చి 8వ తేదీన యాపిల్ తన ఈవెంట్‌లో కొత్త ఐఫోన్ ఎస్ఈని లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఎన్నో ఉత్పత్తులు కూడా లాంచ్ కానున్నాయి.
ఐఫోన్ ఎస్ఈ (2020) ధర
ఈ ఫోన్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,298గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే రూ.1,500 తగ్గింపు అన్నమాట. ఇక మీరు ప్రస్తుతం ఉపయోగించే స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా మరో రూ.14,800 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే సుమారు రూ.16,300 వరకు తగ్గింపు లభించనుంది. ఈ రెండు ఆఫర్లను ఉపయోగించుకుంటే మీరు ఐఫోన్ ఎస్ఈ (2020)ని రూ.13,998కు దక్కించుకోవచ్చు.
ఐఫోన్ ఎస్ఈ (2020) స్పెసిఫికేషన్లు
ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. యాపిల్ ఏ13 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. 4కే 60ఎఫ్‌ఫీఎస్ వీడియో రికార్డింగ్ సామర్థ్యం కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లాక్, వైట్, (ప్రొడక్ట్) రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఐఫోన్ ఎస్ఈ 3 కూడా త్వరలో లాంచ్ కానుంది. కాబట్టి ఈ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. లేదా పూర్తిగా దీని తయారీని నిలిపివేసే అవకాశం కూడా ఉంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)