By: ABP Desam | Updated at : 26 Nov 2021 11:26 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐఫోన్ 12 మినీపై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్
బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ అందించింది. రూ.64,900 విలువైన ఐఫోన్ 12 మినీని ఈ సేల్‌లో రూ.42,999కే కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అంటే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ.20 వేలపైనే తగ్గింపు లభించిందన్న మాట.
ఇది 64 జీబీ వేరియంట్ ధర. మిగతా స్టోరేజ్ వేరియంట్ల ధర కూడా తగ్గే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా రూ.50 వేలలోపే కొనుగోలు చేయవచ్చు. అయితే ముందుగా పేమెంట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కొనుగోలు చేస్తే రూ.44,999కు 64 జీబీ వేరియంట్ లభించనుంది.
ఐఫోన్ 12 మినీ స్పెసిఫికేషన్లు
ఐవోఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఐఫోన్ 12 మినీ పనిచేయనుంది. ఇందులో 5.4 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఐఫోన్ 12 మినీలో వెనకవైపు 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు. ముందువైపు సెల్ఫీ కెమెరా సామర్థ్యం కూడా 12 మెగా పిక్సెల్‌గానే ఉంది.
ఏ14 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 4కే వీడియో ఎడిటింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 5జీ సపోర్ట్ కూడా అందించారు. 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్‌తో పాటు చార్జర్‌ను అందించలేదు. కేవలం లైటెనింగ్ కేబుల్ మాత్రమే ఈ ఫోన్‌తో రానుంది.
అడాప్టర్ ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే మొత్తంగా 15 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను ఈ ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ మందం కేవలం 0.74 సెంటీమీటర్లు మాత్రమే కాగా, బరువు 135 గ్రాములుగా ఉంది.
Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్
Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి