News
News
X

Block Downloading Apps: మీ పిల్లలు పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఇదిగో ఇలా చేస్తే మీ ఫోన్ సేఫ్!

మీ పిల్లలు మీ ఫోన్ లను తరుచుగా తీసుకుంటారా? వారు మీ ఫోన్ లో అనవసరమైన యాప్ లు డౌన్ లోడ్ చేస్తున్నారు. వాటిలో వారి వయసుకు సరిపడని యాప్స్ ఉన్నాయా? అయితే, మీకోసమే ఈ చిట్కా..

FOLLOW US: 

రోనా మహమ్మారి విజృంభించిన తర్వాత పిల్లలకు స్మార్ట్ ఫోన్ మరింత చేరువైంది. ఆన్ లైన్ క్లాసులతో ఫోన్ చూడటం మొదలు పెట్టిన పిల్లలు.. ఆ తర్వాత బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పటికీ తల్లిదండ్రుల ఫోన్ తీసుకుని యూట్యూబ్ లో పాటలు చూడటం, గేమ్స్ ఆడటం లాంటివి చేస్తున్నారు. అదే సమయంలో వారిని ఆకట్టుకునేలా ఉండే రకరకాల యాప్స్ ను డౌన్ లోడ్ చేస్తుంటారు. వాటిలో వయసుకు మించినవి ఉంటాయి. ఒకానొక సమయంలో ఫోన్ డిస్ ప్లే మొత్తం అనవసర యాప్స్ తో నిండిపోయి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో యాప్ ల డౌన్ లోడ్ ను బ్లాక్ చేసేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ ఫోన్ లో అవాంఛిత యాప్ ల డౌన్ లోడ్ ను నిరోధించే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్లో యాప్ డౌన్లోడ్ను ఎలా బ్లాక్ చేయాలి?

చాలా వరకు యాప్ లు అత్యంత సముచితమైనవని గుర్తించడంలో సహాయ పడే ఏజ్ రేటింగ్ ను కలిగి ఉంటాయి. మీరు  Google Play స్టోర్‌ లోని పేరెంటల్ కంట్రోల్ ను ఉపయోగించడం ద్వారా నిర్దిష్ట వయస్సును అధిగమించే యాప్‌ల డౌన్‌లోడ్‌ ను బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సింది.. జస్ట్ కింద చూపించిన స్టెప్స్ ను ఫాలో కావడమే..  

⦿ ముందుగా మీరు Google Play Storeని ఓపెన్ చేయండి.

⦿ స్క్రీన్ కుడి ఎగువ మూలలో మీ ప్రొఫైల్ ఐకాన్ ను నొక్కండి.

⦿ అనంతరం సెట్టింగ్‌లను సెలెక్ట్ చేయండి.

⦿ యూజర్ కంట్రోల్ సెక్షన్ ను క్లిక్ చేయండి. 

⦿ అందులో పేరెంటల్ కంట్రోల్ ను నొక్కండి.

⦿ పేరెంటల్ కంట్రోల్‌ను  ఆన్ చేయండి.

⦿ పిన్ క్రియేట్ చేసి.. ఓకే నొక్కండి.

⦿ అనంతరం మీ పిన్ ను నిర్ధారించుకుని, మరోసారి ఓకే చేయండి.

⦿ ఆ తర్వాత యాప్‌లు & గేమ్‌ల  విభాగాన్ని క్లిక్ చేయండి.

⦿ ఏజ్ లిమిట్ ను ఎంచుకోండి.

⦿ అప్లై టు ఛేంజెస్ దగ్గర సేవ్ అని నొక్కండి. 

ఇకపై మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో మీరు సెట్ చేసిన వయోపరిమితి కంటే ఎక్కువ రేట్ చేయబడిన యాప్‌లు ఎట్టి పరిస్థితుల్లో  డౌన్‌లోడ్ చేయబడవు.

Google Family Linkతోనూ యాప్ డౌన్లోడ్  బ్లాక్ చెయ్యొచ్చు!

Google Family Link యాప్ ను ఉపయోగించి కూడా పిల్లలు అనవసర, అవాంఛిత యాప్స్ డౌన్ లోడ్ చేయకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది.

⦿ ముందుగా మీరు Google Family Linkని డౌన్‌లోడ్ చేసుకోండి.

⦿ ఇన్ స్టాల్ అయ్యాక .. హోమ్  స్క్రీన్ పైన ఎడమ మూలలో హాంబర్గర్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

⦿ ఆ తర్వాత చైల్డ్ అకౌంట్ సెలెక్ట్ చేయండి.

⦿ అనంతరం మేనేజ్ సెట్టింగ్ ను ట్యాప్ చేయండి.  

⦿ మేనేజ్ పై క్లిక్ చేయండి.  

⦿ లిస్టులో కనిపించే Google Playను ఎంచుకోండి.

⦿ కంటెంట్ రిస్ట్రిక్షన్స్ విభాగంలో  యాప్స్ & గేమ్స్ పై నొక్కండి.

⦿ తగిన వయోపరిమితిని ఎంచుకోండి.  

ఇకపై మీ ఫోన్ లో మీరు సెట్ చేసిన వయోపరిమితి కంటే ఎక్కువ రేట్ చేయబడిన యాప్‌లు డౌన్ లోడ్ కావు.

Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?

Published at : 08 Sep 2022 03:36 PM (IST) Tags: Android unnecessary apps Downloading Apps Block

సంబంధిత కథనాలు

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Hisense U7H TV Series: సూపర్ డిస్‌ప్లే, అదిరిపోయే సౌండ్‌తో హైసెన్స్ కొత్త టీవీలు - ధర ఎంతంటే?

Hisense U7H TV Series: సూపర్ డిస్‌ప్లే, అదిరిపోయే సౌండ్‌తో హైసెన్స్ కొత్త టీవీలు - ధర ఎంతంటే?

Google Pixel 7 Price: గూగుల్ కొత్త ఫోన్ రేట్ లీక్ - ఈసారి యాపిల్ రేంజ్‌లో!

Google Pixel 7 Price: గూగుల్ కొత్త ఫోన్ రేట్ లీక్ - ఈసారి యాపిల్ రేంజ్‌లో!

Apple Event: యాపిల్ కొత్త ఈవెంట్‌ త్వరలో - ఈసారి ల్యాప్‌టాప్‌లు!

Apple Event: యాపిల్ కొత్త ఈవెంట్‌ త్వరలో - ఈసారి ల్యాప్‌టాప్‌లు!

Whatsapp Call Links : వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

Whatsapp Call Links :  వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Anchor Sreemukhi: డాన్స్ ఐకాన్ కోసం ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయిన శ్రీముఖి

Anchor Sreemukhi:  డాన్స్ ఐకాన్ కోసం ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయిన శ్రీముఖి

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు