AI టెక్నాలజీ వలన సినిమా నిర్మాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం 90% నుండి 99% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. గతంలో వేల కోట్లు ఖర్చయ్యే హై క్వాలిటీ వీడియోలను ఇప్పుడు AI ద్వారా చాలా తక్కువ ఖర్చుతో రూపొందించవచ్చు.
Shekhar Kapur : కోట్లు ఖర్చు అయ్యే సీన్‌ను రూ.40లకే తీయొచ్చు! ఏఐ విప్లవంపై డైరెక్టర్ శేఖర్ కపూర్ సంచలన కామెంట్స్
AI Impact Summit 2026:సినిమాలో కూడా ఏఐ విప్లవం వస్తోందని డైరెక్టర్ శేఖర్ కపూర్ అభిప్రాయపడ్డారు. కోట్ల ఖర్చు పెట్టే తీసే సీన్‌లను ఇంట్లోనే కూర్చొని ల్యాప్‌టాప్‌లో క్రియేట్ చేయవచ్చని తెలిపారు.

Shekhar Kapur AI Impact Summit 2026: సినిమా అంటేనే భారీ బడ్జెట్‌లు, వందలాది మంది నిపుణులు, ఖరీదైన సెట్లు, అత్యాధునిక కెమెరాలు గుర్తుకు వస్తాయి. కానీ త్వరలోనే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఒక సామాన్య వ్యక్తి కూడా తన ల్యాప్‌టాప్‌ద్వారా ఒక భారీ సినిమాను నిర్మించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రముఖ సినిమా డైరెక్టర్ శేఖర్ కపూర్ కామెంట్ చేశారు.
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సినిమా నిర్మాణ రంగం ఎంత ప్రభావితం కాబోతుందో, భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతటి మేలు చేకూరుస్తుందో ఆయన సవివరంగా తెలియజేశారు.
భారీగా తగ్గనున్న సినిమా నిర్మాణ ఖర్చు
సాధారణంగా ఒక సినిమా నిర్మించాలంటే భారీగా పెట్టుబడి పెట్టాలి. కానీ ఏఐ టెక్నాలజీ వల్ల సినిమా నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గబోతున్నాయని శేఖర్ కపూర్ జోస్యం చెప్పారు. భారీ చిత్రాలతో ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఆయన స్వయంగా తన ప్రాజెక్టులలో ఏఐని వాడుతున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ వల్ల సినిమా బడ్జెట్‌లో దాదాపు 90 శాతం నుంచి 99 శాతం వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందన్నారు. గతంలో ఒక నిమిషం నిడివి ఉన్న హై క్వాలిటీ వీడియోను రూపొందించడానికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా కేవలం నలభై రూపాయల ఖర్చుతోనే అలాంటి అద్భుతమైన వీడియోలు రూపొందించవచ్చని చెప్పారు. అమెజాన్ వంటి సంస్థలు అభివృద్ధి చేస్తున్న ఏఐ స్టూడియోలు ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని పనులను సులభతరం చేస్తున్నాయి.
మారుమూల ప్రాంతాల నుంచి కొత్త దర్శకులు
శేఖర్ కపూర్ దృష్టిలో ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు. అది ఒక డెమోక్రటిక్ టెక్నాలజీ అంటే ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో ఉన్న గేట్ కీపింగ్ వ్యవస్థను ఇది బద్దలు కొడుతుంది. గతంలో సినిమా తీయాలంటే పెద్ద స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఎంతో మంది సిఫార్స్ ఉండాలి. కానీ ఇకపై అలా ఉండదు. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాల నుంచి సరైన అవకాశాలు లేని ప్రతిభావంతులకు ఏఐ వరంలా మారనుంది. కేవలం ఒక ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఒక వ్యక్తి మొత్తం స్టూడియో చేయాల్సిన పనిని ఒంటరిగా పూర్తి చేయగలడు. ఫిల్మ్ స్కూల్స్‌లో చదవకపోయినా స్క్రిప్ట్ రాయడం నుంచి ఎడిటింగ్ వరకు ఏఐ సహాయంతో అత్యుత్తమ నాణ్యతతో చిత్రాలను రూపొందించవచ్చు. దీని వల్ల దేశంలో కొత్త కథలు, కొత్త గొంతులు వినిపిస్తాయని కపూర్ అభిప్రాయపడ్డారు.
భారత్ ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల ఊతం
ఈ సదస్సులో శేఖర్ కపూర్ కేవలం సినిమా గురించి మాత్రమే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధిపై కూడా కీలక విశ్లేషణ చేశారు. ఏఐ వల్ల భారత్ జీడీపీ ఏటా సుమారు లక్షల కోట్లు అదనంగా చేకూరవచ్చని ఆయన అంచనా వేశారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ అంచనాలను ధృవీకరిస్తున్నాయి. గోల్ట్‌మన్‌సాచ్స్ నివేదిక ప్రకారం 2030 నాటికి ఏఐ ద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థకు 1.2 నుంచి 1.5 ట్రిలియన్ డాలర్లు చేకూరతాయి. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం పదేళ్లలో ఇది రెండు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
మానవ మేధస్సు వర్సెస్ ఏఐ
ఏఐ ఎన్ని అద్భుతాలు చేసినా, అది మనిషిని మాత్రం మించి ఆలోచించలేదని శేఖర్ కపూర్ స్పష్టంగా చెప్పారు. సహజంగా ఆలోచించే జ్ఞానం ఏఐ వద్ద లేనందున సినిమాలోని భావోద్వేగాలు, సంస్కృతి, నైతిక విలువల పండించాలంటే మనిషికే సాధ్యమన్నారు. అందుకే ఏఐని సహాయకారిగానే వాడుకోవాలే తప్ప దానిపై పూర్తిగా ఆధారపడకూడదని ఆయన సూచించారు. మెషిన్ పని మెషిన్ చేస్తుంది కానీ పనికి ఆత్మను పోసేది మాత్రం మనిషి ఆలోచనలేనని ఆయన నొక్కి చెప్పారు.
ఎదురయ్యే సవాళ్లు
ఏఐ తీసుకొచ్చే మార్పులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొన్ని హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైటర్లు, ఎడిటర్లు, నటీనటుల ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హాలీవుడ్‌లో జరిగిన సమ్మెలు దీనికి నిదర్శనం. డీప్‌ఫేక్, కాపీరైట్ సమస్యలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వంటి నైతిక సవాళ్లు కూడా ఈ టెక్నాలజీ తో ముడిపడి ఉన్నాయి.
Frequently Asked Questions
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సినిమా నిర్మాణ ఖర్చులను ఎలా తగ్గిస్తుంది?
AI వలన సినిమా పరిశ్రమలో కొత్త దర్శకులు ఎలా వస్తారు?
AI అనేది సినిమా పరిశ్రమలో గేట్ కీపింగ్ వ్యవస్థను బద్దలు కొడుతుంది. చిన్న గ్రామాలు, పట్టణాల నుండి ప్రతిభావంతులకు అవకాశాలు లభిస్తాయి. కేవలం ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు, ఒక వ్యక్తి మొత్తం స్టూడియో పనిని చేయగలడు.
AI భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత మేలు చేస్తుంది?
AI వలన భారతదేశ GDP ప్రతి సంవత్సరం లక్షల కోట్లు అదనంగా చేకూరవచ్చు. 2030 నాటికి AI ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు 1.2 నుండి 1.5 ట్రిలియన్ డాలర్లు చేకూరుతాయని అంచనా. నీతి ఆయోగ్ ప్రకారం, పదేళ్లలో ఇది 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
AI మానవ మేధస్సును పూర్తిగా భర్తీ చేయగలదా?
AI అద్భుతాలు చేసినా, మనిషిని మించి ఆలోచించలేదు. భావోద్వేగాలు, సంస్కృతి, నైతిక విలువలను పండించడానికి మనిషికే సాధ్యం. AIని సహాయకారిగానే వాడుకోవాలి, దానిపై పూర్తిగా ఆధారపడకూడదు.























