Aura Of Ustaad Song Promo : పవన్ కల్యాణ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ ప్రోమో - పవర్ స్టార్ ఎలివేషన్ గూస్ బంప్స్... ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
Ustaad Bhagat Singh Song : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. రెండో సాంగ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' ప్రోమో రిలీజ్ అయ్యింది.

Pawan Kalyan's Aura Of Ustaad Song Promo Out : 'OG' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాబోతోన్న అవెయిటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ప్రోమో వచ్చేసింది.
పవర్ ఫుల్ ఎలివేషన్
ఈ మూవీకి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్ ఎలివేట్ చేసేలా 'ఆరా ఆఫ్ ఉస్తాద్' ప్రోమో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పవన్ స్టైల్, మేనరిజం చూపించేలా సాంగ్ ఉండనుందని ప్రోమోను బట్టి అర్థమవుతోంది. 'గబ్బర్ సింగ్' తర్వాత అంతకు మించిన స్థాయిలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపించనున్నారు. ఆయన లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ నెల 22న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే వచ్చిన 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ ట్రెండ్ అవుతోంది. వింటేజ్ పవర్ స్టార్‌ను గుర్తు చేసేలా పవన్ లుక్... డ్యాన్స్ అదిరిపోయాయి. అంతకు మించి 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ ఉండనుంది.
Also Read : మహేష్ బాబు 'వారణాసి' బిగ్ అప్డేట్ - మ్యూజిక్ వర్క్స్‌పై కీరవాణి ఏమన్నారంటే?
ఈ మూవీలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. తమిళ సీనియర్ హీరో పార్తీబన్ విలన్ రోల్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్ నల్ల నాగప్ప పాత్రలో ఆయన కనిపించనుండగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వీరిద్దరి మధ్య సీన్స్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఉంటాయని... పవర్ స్టార్ హీరోయిజం సూపర్ ఎలివేట్ అవుతుందని తెలుస్తోంది. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్‌లది హిట్ కాంబో. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... ఇక మూవీ రిలీజ్ అయితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వేసవి సీజన్ ఈ మూవీతో ఓపెన్ కానుండడంతో భారీ ఓపెనింగ్స్, కలెక్షన్స్ సాధిస్తుందని మూవీ టీం భావిస్తోంది.
The AURA that defined an ERA 🔥🔥🔥#UstaadBhagatSingh second single #AuraOfUstaad Promo out now!
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) February 19, 2026
▶️ https://t.co/l1yYznpcqS
Full song on February 22nd 🤩#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan @harish2you… pic.twitter.com/NOT5YLmeib
























