Govinda : అమ్మ కాళ్లు కడిగి నీళ్లు తాగిన బాలీవుడ్ హీరో - ఓన్లీ కాంట్రవర్సీస్ మాత్రమే కాదు...
Govinda Nephew : బాలీవుడ్ స్టార్ హీరో గోవిందాపై ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ ప్రశంసలు కురిపించారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఛాన్సెస్ తగ్గిపోవడం బాధ పడినట్లు చెప్పారు.

Bollywood Actor Govinda Washed Her Mother Feet : వ్యక్తిగత విషయాలు, వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా. గతేడాది ఆయన భార్య సునీత అహుజా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా గోవిందా మేనల్లుడు వినయ్ ఆనంద్... ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
తల్లి పాదాలు కడిగి...
గోవిందా అంకుల్‌ను చూసి తాను చాలా ఇన్‌స్పైర్ అయ్యానని రీసెంట్ పాడ్ కాస్ట్‌లో వినయ్ ఆనంద్ తెలిపారు. 'ఇండస్ట్రీలో టాప్ స్థాయిలో ఉన్నప్పుడు దేశం మొత్తం ఆయన నుంచి స్ఫూర్తి పొందింది. ఆయన డ్యాన్స్ కాపీ కొట్టని స్టార్ హీరోస్ లేరు. డ్యాన్స్ చేయడం రాని వారు కూడా ఆయన్ను చూసి స్టెప్పులేస్తారు. అమ్మమ్మ (గోవిందా తల్లి) బర్త్ డే రోజున ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగేవారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఛాన్సెస్ తగ్గిపోవడం చూసి చాలా బాధపడ్డాను.
తన కోసం ఆఫర్స్ తెచ్చినా, ఈవెంట్స్ చేయమని అడిగినా ఒప్పుకోలేదు. మా మధ్య 14 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఆయన నాకు మామయ్య అయినా ఎందుకిలా ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నావని నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఆయన ఏం చెప్పినా ఓకే సర్ అంటుంటాను. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించినా, హీరోగా ఎంత గుర్తింపు ఉన్నా ఆయన ముందు నేను ఎప్పటికీ వినమ్రంగానే ఉంటాను.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : పవన్ కల్యాణ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ ప్రోమో - పవర్ స్టార్ ఎలివేషన్ వేరే లెవల్
దివాలా వార్తలపై...
గోవిందా గత కొంతకాలంగా సినిమాలు చేయడం లేదని ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదనే రూమర్స్ ఇటీవల హల్చల్ చేశాయి. రీసెంట్‌గా చిన్న కారులో యూపీ సీఎంను కలవడంతో వాటికి మరింత బలం చేకూరింది. వీటికి ఆయన మేనేజర్ చెక్ పెట్టారు. ఆ రూమర్స్ అన్నీ నిరాధారమైనవని అన్నారు. 'గోవిందాకు పరిశ్రమలో ప్రముఖుల నుంచి సినిమాల్లో నటించే ఛాన్సెస్ వస్తున్నాయి. త్వరలోనే ఓ పెద్ద సినిమాను అనౌన్స్ చేయనున్నారు.
ఆయనకు ఒక కారు మాత్రమే కాదు. చాలా కార్లు ఉన్నాయి. ఆయన దివాళా తీశారు అనే వార్తలు పూర్తిగా నిరాధారం. ఆ టైంలో ప్రైవేట్ వాహనాలకు ఎయిర్ పోర్టులో అనుమతి లేదు. ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ ఈవెంట్లలో డ్యాన్స్ చేస్తున్నారన్న పుకార్లలో నిజం లేదు.' అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
డివోర్స్ రూమర్స్‌పై
గత కొంతకాలంగా గోవిందా భార్య సునీతతో డివోర్స్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరగ్గా... వాటిని ఆమె ఖండించారు. అయితే, తరచూ గోవిందాపై ఆమె విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతేడాది కూడా తీవ్ర విమర్శలు చేశారు.
ఇక గోవిందా రీఎంట్రీకి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'లో నటించనున్నారు. ఈ మూవీలో గోవిందా అతిథి పాత్రలో కనిపించనుండగా హైప్ క్రియేట్ అవుతోంది.
























