Honor Magic 4 Series: ఒకే ఫోన్‌లో 50+50+64 మెగాపిక్సెల్ కెమెరాలు - హానర్ అదిరిపోయే ఫోన్లు వచ్చేశాయ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. అవే హానర్ మ్యాజిక్ 4 సిరీస్. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 4, హానర్ మ్యాజిక్ 4 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.
Honor Magic 4 Series Launched: హానర్ మ్యాజిక్ 4 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో హానర్ మ్యాజిక్ 4 (Honor Magic 4), హానర్ మ్యాజిక్ 4 ప్రో (Honor Magic 4 Pro) స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 (Qualcomm Snapdragon 8 Gen 1) ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వీటిలో 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. వైర్‌లెస్ చార్జింగ్, ఫేస్ అన్‌లాక్, సెకండ్ జనరేషన్ అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.
హానర్ మ్యాజిక్ 4, హానర్ మ్యాజిక్ 4 ప్రో ధర
హానర్ మ్యాజిక్ 4లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 899 యూరోలుగా (సుమారు రూ.76,000) నిర్ణయించారు. హానర్ మ్యాజిక్ 4 ప్రోలో కూడా కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. ఇందులో కూడా 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌నే అందించారు. దీని ధర 1,099 యూరోలుగా (సుమారు రూ.93,000) ఉంది. బ్లాక్, సియాన్, గోల్డ్, వైట్, స్పెషల్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలియరాలేదు.
హానర్ మ్యాజిక్ 4 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.81 అంగుళాల ఫ్లెక్స్ ఓఎల్ఈడీ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ మధ్య మన ఫోన్ వినియోగాన్ని బట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెరగనుంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉండనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్‌గా ఉంది. 100W వైర్డ్, వైర్‌లెస్ సూపర్ చార్జ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుందని తెలుస్తోంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. 100x డిజిటల్ జూమ్, 3.5x ఆప్టికల్ జూమ్‌ను ఇది అందించనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
హానర్ మ్యాజిక్ 4 స్పెసిఫికేషన్లు
ప్రో మోడల్‌లో కూడా హానర్ మ్యాజిక్ 4 తరహాలోనే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇందులో కూడా 6.81 అంగుళాల డిస్‌ప్లేనే అందించారు. ఈ రెండిటి మధ్యా ప్రధాన మార్పు కెమెరాల్లో ఉంది. ఇందులో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో పాటు 8 మెగాపిక్సెల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ షూటర్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, 5జీ, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!