Flipkart Same Day Delivery: ఏపీలో ఒక సిటీలో, తెలంగాణలో ఒక సిటీలో - సేమ్ డే డెలివరీని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్!
Flipkart Same Day Delivery: ఫ్లిప్‌కార్ట్ కొన్ని నగరాల్లో సేమ్ డే డెలివరీ సేవలను ప్రారంభించింది.
Shopping Apps in India: ప్రస్తుతం అనేక షాపింగ్ యాప్‌లు భారతదేశంలో తమ సేవలను అందిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ వేగంగా పెరిగింది. దీంతో కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. వినియోగదారులను ఆకర్షించడానికి ప్రతి కంపెనీ కొత్త రకాల సర్వీసులు, ఫీచర్లను జోడిస్తూనే ఉంటుంది. ఈసారి ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే విధమైన సర్వీసును ప్రకటించింది. ఈ ఫీచర్ వినియోగదారులకు బాగా ఉపయోగపడనుంది.
ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలోని 20 నగరాల్లో సేమ్ డే డెలివరీ సేవలను ప్రకటించింది. అంటే భారతదేశంలోని 20 నగరాల్లో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లయితే, అదే రోజు వినియోగదారుడి ఇంటికి డెలివరీ అవుతుంది. ఈ సేవ వినియోగదారులకు సచాలా సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఈ-కామర్స్ యాప్‌ల డెలివరీ ఆలస్యంగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లేట్‌గా రావడం వల్ల ఆర్డర్ చేసిన తర్వాత కూడా చాలా సార్లు దాన్ని రిటర్న్ కూడా చేస్తారు.
అమెజాన్ తన ప్రైమ్ వినియోగదారులకు నెక్స్ట్ డే డెలివరీని, అనేక ఉత్పత్తులపై సాధారణ వినియోగదారులకు సేమ్ డే డెలివరీని కూడా అందిస్తుంది. అమెజాన్ మాత్రమే కాకుండా మింత్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర షాపింగ్ యాప్‌ల నుంచి షాపింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు వినియోగదారులు ఆర్డర్ చేసిన రోజున వస్తువులు వారి ఇళ్లకు చేరుకుంటాయి. కానీ దీనికి ఎటువంటి హామీ లేదు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా సేమ్ డే డెలివరీ సేవను ప్రకటించింది.
ఈ నగరాల్లో సేమ్ డే డెలివరీ
అహ్మదాబాద్
బెంగళూరు
భువనేశ్వర్
కోయంబత్తూరు
చెన్నై
ఢిల్లీ
గౌహతి
హైదరాబాద్
ఇండోర్
జైపూర్
కోల్‌కతా
లక్నో
లూధియానా
ముంబై
నాగపూర్
పుణే
పాట్నా
రాయ్‌పూర్
సిలిగురి
విజయవాడ
ఎప్పుడు ఆర్డర్ చేయాలి?
పైన పేర్కొన్న 20 నగరాల్లో నివసించే వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ యాప్ నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఏదైనా ప్రొడక్ట్‌ను ఆర్డర్ చేస్తే ఆ ఉత్పత్తి అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు వారి ఇంటికి చేరుకుంటుంది. రానున్న కాలంలో దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈ సేవలను ప్రారంభిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండాలి.
ఫ్లిప్‌కార్ట్ కూడా 2014లో 10 నగరాల్లో ఈ సేవను పరీక్షించిందని కానీ దాదాపు 10 సంవత్సరాల ఈ సేవను అధికారికంగా ప్రారంభించింది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌కు అతిపెద్ద పోటీదారు అయిన అమెజాన్ ఈ-కామర్స్ సంస్థ 2017 నుంచి భారతదేశంలోని అనేక నగరాల్లో సేమ్ డే డెలివరీ సేవను ప్రారంభించింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే యూఏఈలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈకి తర్వాతి వెర్షన్‌గా ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను మొబైల్ పక్కభాగంలో అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ అందుబాటులో ఉంది. ఒక్క ర్యామ్ ఆప్షన్, రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!